garden crops
-
పూలు, పండ్ల మొక్కలతో పాటు కూరగాయల నారు పెంపకం
-
ఉద్యాన పంటలకు భారీ రాయితీలు
కీసర: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున్న రాయితీ(సబ్సిడీ)ని అందజేస్తుందని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని కుందన్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉద్యాన పంటల సాగులో భాగంగా రైతు సత్యనారాయణరెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన పాలీహౌస్ షెడ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అందజేస్తున్న 75 శాతం సబ్సిడీ కింద మొదటి పాలీహౌస్ షెడ్‌ను ఇక్కడ నిర్మించారన్నారు. గతంలో ఉద్యానవన పంటల సాగుకోసం నిర్మించే షెడ్లకు 50 శాతం మాత్రమే సబ్సిడీ లభించేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును పెంచేందుకు గానూ సబ్సిడీని 50 శాతం నుంచి 70 శాతానికి పెంచారన్నారు. రాజధానికి 100 కిలోమీటర్ల వరకు ఉద్యానవన పంటల సాగు ఇటీవల కాలంలోనే విస్తరించడం హర్షనీయమని ఉద్యానవన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి అన్నారు. -
ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదు
హైదరాబాద్:ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. అయినా ఆ పంటలను కూడా రుణమాఫీ జాబితాలో చేర్చాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎరువులను, యూరియాను రూ.100 అదనంగా అమ్ముతున్నట్లు సమాచారముందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి శనివారం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి.. బ్లాక్ మార్కెట్ పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఎరువుల షాపులపై దాడులు నిర్వహించి.. అధిక ధరలకు విక్రయించే షాపులను సీజ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎరువులు, యూరియాలో కొరత లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 18001801551 కు ఫోన్ నంబర్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.