సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యానవన పంటల్లో రాణిస్తున్న రైతులు, అధికారులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవార్డులు అందించారు. విజయవాడ ఆంధ్రాలయోల కళాశాల ప్రాంగణంలో ఉద్యానశాఖ, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ ఉద్యాన, మామిడి మేళా-2016లో ఈ అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అందించారు.
ఉద్యాన పంటల విభాగం: చామంతిసాగులో సీహెచ్ లీలాప్రసాద్(విజయనగరం జిల్లా), బంతి సాగులో తూకూరి గైరమ్మ (విశాఖ జిల్లా), అరటిసాగులో చాట్ల సత్యనారాయణ రాజు (విశాఖ జిల్లా), మామిడి సాగులో చీర్ల నరసింహారావు (తూర్పుగోదావరి), హోతా వీరభద్రరావు (పశ్చిమగోదావరి), ఎస్.జనార్దన రెడ్డి(వైఎస్సార్ కడప), నిమ్మసాగులో మోటూరి శ్రీనివాసరావు(కృష్ణాజిల్లా), టమాట, క్యాప్సికమ్ సాగులో యనమదల సత్యనారాయణ (గుంటూరు జిల్లా), టి.సరస్వతి (కర్నూలు), మామిడి, కూరగాయలు, పూలు సాగులో కాట్రగడ్డ సుబ్బారావు (ప్రకాశం), బత్తాయి సాగులో దేవరపల్లి వెంకట ఈశ్వర్‌దత్తు(నెల్లూరు), దానిమ్మ పంటకు కె.చంద్రశేఖర్ (అనంతపురం), బొప్పాయి, కూరగాయలు పంటలకు సి.అశోక్ కుమార్(చిత్తూరు)లు సత్కారాలు, అవార్డులు అందుకున్నారు.
సూక్ష్మ నీటిపారుదల (డ్రిప్ ఇరిగేషన్) విభాగంలో :
ఉద్యన పంటల సాగులో సూక్ష్మ నీటిపారుదల విభాగంలో పలువురు రైతులకు అవార్డులు అందించారు. కొరికిన రవికుమార్(శ్రీకాకుళం జిల్లా), బి.కొండబాబు (విజయనగరం జిలా), కొల్లి సురేష్ (విశాఖ జిల్లా), డి.సత్యనారాయణరాజు (తూర్పుగోదావరి జిల్లా), ముళ్లపూడి మురళీకృష్ణ (పశ్చిమగోదావరి), గొల్లపూడి మోహనరావు (కృష్ణాజిల్లా), శాఖమూరి పేరయ్య (గుంటూరు), పెంట్యాల సాంబశివరావు(ప్రకాశం), తల్లా రమేష్(నెల్లూరు), సి.అశోక్‌కుమార్ (చిత్తూరు), కె.నాగేశ్వరరావు (వైఎస్సార్ కడప), ఎం.ఓబయ్య( అనంతపురం), పి.యాగంటిరెడ్డి(కర్నూలు) అవార్డులు అందుకున్నారు.
పురస్కారాలు అందుకున్న అధికారులు
డిప్యూటీ డెరైక్టర్ బి.ఎస్ సుబ్బయ్యనాయుడు (అనంతపురం), కమిషనరేట్‌కు చెందిన ఏడీహెచ్ ఎస్.వి.రతన్ ఆచార్యులు, అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ హార్టికల్చర్ డి. మధునూదనరెడ్డి (ప్రొద్దుటూరు), పి.జెనమ్మ (కందుకూరు), చంద్రశేఖర్ (అనంతపురం), హరేంద్ర (కుప్పం), ఎం.డి. అబ్దుల్ రహీం (శ్రీకాకుళం)లతో పాటు మైక్రో ఇరిగేషన్, సీఐఐ ప్రతినిధులకు, సంస్థలకు, కంపెనీలకు కూడా అవార్డులు అందించారు
ఉద్యాన రైతులకు అవార్డుల పంట
Published Mon, May 23 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM
Advertisement
Advertisement