
సాక్షి, అమరావతి : విదేశీ కంపెనీలు వస్తువులను అనుమతి లేకుండా అమ్ముతున్న షాపుల్లో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. బుధవారం విజయవాడలోని పీవీపీ మల్టీప్లెక్స్ మాల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...18 షాపులను తనిఖీ చేశామని తెలిపారు. విదేశీ కంపెనీలు వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్నాయని, సెలక్ట్ చానల్ పేరుతో ఒకే రకమైన ఉత్పత్తులపై వేర్వేరు రేట్లు ముద్రిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, అనుమతి తేకుండా అమ్ముతున్న షాపులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
వ్యాపారస్తులు ఇష్టం వచ్చిన ఎమ్మార్పీకి జీఎస్టీని కలపడం వంటివి జరుగకుండా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చట్టంలో మార్పులు తీసుకురావాలని అన్నారు. లోకల్ బ్రాండ్ వాటర్ బాటిల్ రేటు కూడా దారుణంగా పెంచేశారని, గోల్డు షాపుల్లో ఎక్కువ మంది వినియోగదారులు నష్టపోతురన్నారు. అదేవిధంగా పెట్రోలు, గ్యాస్, ఎరువుల తూకాల్లో మోసాలు జరుతున్నాయని, ప్రజలు వీటిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment