![పెరగనున్న విద్యుత్ చార్జీలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71425159190_625x300.jpg.webp?itok=pArVtSR-)
పెరగనున్న విద్యుత్ చార్జీలు
బొగ్గుపై పర్యావరణ అనుకూల ఇంధన సెస్సును బడ్జెట్‌లో టన్నుకు రూ. 100 నుంచి రూ. 200కు రెట్టింపు చేయడం.. విద్యుత్ చార్జీల పెంపునకు దారి తీయనుంది. తాజా పరిణామంతో ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియాపై రూ. 5,000 కోట్ల మేర భారం పడనుంది. దీన్ని అది విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై.. అవి అంతిమంగా వినియోగదారులకు బదలాయించనున్నాయి. ఫలితంగా విద్యుత్ చార్జీలు యూనిట్‌కు కనీసం 4 పైసల మేర ప్రభావం పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.