
హైదరాబాద్: ఇద్దరు కలిసి ఒకే పరిశ్రమలో పని చేస్తుండడంతో వారిద్దరూ కలిసి ఒక గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో వంటావార్పు చేసుకుని తింటూ పనికి వెళ్తున్నారు. అయితే రూమ్‌లో పనులు చెరి సగం చేసుకోవాల్సిన విషయంలో ఇద్దరి అభిప్రాయ బేధాలు వచ్చి చంపుకునే దాక చేరాయి. తాజాగా కూరగాయలు కోయమని మిత్రుడిని అడగా అతడు పెడచెవిన పెట్టడంతో వివాదం మొదలైంది. అటు నుంచి గొడవ పెద్దదై అదే కత్తితో పొడిచే స్థాయికి చేరింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
స్థానిక హెచ్‌పీ రోడ్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైతాస్ ఆలి సల్మాన్, ఫిరోజ్ ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలల నుంచి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో గదికి వారిద్దరు వచ్చారు. వంట కోసం కూరగాయలు కట్ చేసి ఇవ్వమని మైతాస్ ఆలి కోరగా సల్మాన్ ఫిరోజ్ పట్టించుకోలేదు. దీంతో కూరగాయలు కట్ చేసే కత్తితో సల్మాన్ ఫిరోజ్‌పై దాడి చేశాడు. దీంతో ఫిరోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఫిరోజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment