దేశంలో తృణధాన్యాలు,పప్పులు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తులకు కొరత
2030–31 నాటికి డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండదు
వచ్చే ఆర్థిక ఏడాదిలోనూ పప్పులు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తులకు కొరతే
నాలుగేళ్లుగా బియ్యం, గోధుమలు, తృణధాన్యాల తలసరి లభ్యత పెరుగుతోంది
పప్పుల తలసరి లభ్యతలో హెచ్చుతగ్గులు
ఆహార ధాన్యాలు మాత్రం డిమాండ్ కంటే అధికంగానే సరఫరా
నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో పప్పు ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో ఆహార ధాన్యాలకు కొరత లేనప్పటికీ.. పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తులు డిమాండ్‌కు తగినట్టు సరఫరా ఉండదని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక తేల్చింది.
వచ్చే ఆర్థిక ఏడాది (2025–26)తో పాటు, 2030–31 ఆర్థిక ఏడాది నాటికి ఆహార ధాన్యాలు డిమాండ్–సరఫరాతోపాటు పప్పులు, తృణధాన్యాలు, కూరగాయల డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాలతోపాటు వివిధ ఆహారోత్పత్తులు రోజువారీ తలసరి లభ్యతపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదికలో ఆసక్తికర విషయాలనువెల్లడించింది.
నీతి ఆయోగ్ నివేదిక ఏం తేల్చిందంటే..
నాలుగేళ్లుగా బియ్యం, గోధుమలు, తృణధాన్యాల రోజువారీ తలసరి లభ్యత పెరుగుతోంది. అయితే, పప్పుల రోజువారీ తలసరి లభ్యతలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.
రానున్న రోజుల్లోనూ పప్పులు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తుల డిమాండ్–సరఫరాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉంటుంది.
దేశంలో వివిధ పంటల సాగు విస్తీర్ణంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. దీనికి వాతావరణ పరిస్థితులు, నీటి పారుదల సౌకర్యాల లేమి, నేల పరిస్థితులు, తెగుళ్లు, వ్యాధులు వంటివి ప్రధాన కారణాలు.
Comments
Please login to add a commentAdd a comment