ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఒక కాలనీలో కుమారుని బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఉందంతం స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది.
లక్నోలోని ములాయం నగర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సుశీల్‌శర్మ(45) తన భర్య కిరణ్, పిల్లలు సాక్షి, సార్థక్, మన్నత్‌లతో పాటు స్థానికంగా ఉంటున్నాడు. తాజాగా సునీల్ శర్మ తన కుమారుడు సార్థక్ పుట్టినరోజు సంద్భంగా కేక్ కట్ చేస్తుండగా కళ్లుతిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి మృతి చెందినట్లు ధృవీకరించారు. సునీల్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
మృతుని భార్య కిరణ్ మాట్లాడుతూ తమపై 22 లక్షలు రుణం ఉందని, ప్రతీనెల రూ. 70 వేలు కడుతున్నామని తెలిపారు. అయితే ఈనెల సొమ్ము కట్టలేకపోవడంతో అప్పు ఇచ్చినవారు ఘోరంగా అవమానించారని, దీంతో తన భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని పేర్కొన్నారు. మృతుని భార్య కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బావిలోకి తోసి.. భార్య విలవిలలాడుతుంటే వీడియో తీసి..
Comments
Please login to add a commentAdd a comment