సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై కొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది.
ఈ మేరకు డిస్కంలు ఇంటింటికి పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు పంపిణీ చేస్తున్నాయి. దీంతో ప్రజలపైవిద్యుత్ చార్జీల భారం మోపి 6,072 కోట్లు వసూలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు చూసి వినియోగదారులు గొల్లు మంటున్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు రోజు వారి వేతన జీవులు, రైతులు, చిరు వ్యాపారులు పాలిట శాపంగా మారాయి. అద్దె గృహాల్లో చాలీచాలని జీతాలతో కుటుంబాలు నడిపే వారిపై విద్యుత్ చార్జీల పెను భారంగా తయారయ్యాయి.
విద్యుత్ చార్జీల భారంతో చిన్న, మధ్య తరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు 5 నెలల్లోనే 15,500 కోట్ల విద్యుత్ భారం మోపి వసూళ్లు చేస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి ఈ విద్యుత్ చార్జీలు మరింత పెరగనున్నాయి. ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు పూనుకుంది.
ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్
విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే.
వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు.
2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment