న్యూఢిల్లీ: భారత్‌కు ఉన్న అపారమైన మేధో మూలధనాన్ని అమెరికా గుర్తిచిందని ఇండస్‌ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఐఆర్‌ఎఫ్) వ్యవస్థాపకుడు గురుప్రసాద్ సౌలే తెలిపారు. సెమీ కండక్టర్ తదితర కీలక రంగాల్లో భారత్‌తో అనుసంధానం కోసం ముందుకు రావడం కీలక పరిణామమన్నారు. భారత్‌ను కేవలం సేవల కేంద్రంగా అమెరికా ఇంక ఎంతమాత్రం చూడడం లేదన్నారు.
ఈ విషయమై అగ్రరాజ్య ధోరణలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో గురుప్రసాద్ సమావేశం కావడం గమనార్హం. ‘‘అమెరికా నుంచి సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు బదిలీ అవ్వడం నిదానంగా జరుగుతుంది. కొన్ని టెక్నాలజీలను భారత్‌తో పంచుకునేందుకు అమెరికా నిజంగా సిద్ధంగా లేదు.
కానీ ప్రధాని మోదీ పర్యటన తర్వాత భారత్‌లో తయారీ విషయమై చెప్పుకోతగ్గ మార్పు అమెరికాలో వచ్చింది’’అని గరుప్రసాద్ వివరించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్, హెల్త్‌కేర్, ఏఐ రంగాల్లో భారత్ మరింత పురోగమిస్తుందని అమెరికా భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో భారత స్టార్టప్‌లకు అపార అవకాశాలున్నాయంటూ.. చాలా స్టార్టప్‌లకు నాస్‌డాక్‌లో లిస్ట్ అయ్యేందుకు ఆదాయం అవసరం లేదన్న విషయం తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment