capability
-
ఆరు నగరాల్లో జీసీసీల జోరు
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌ను (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ఆరు ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ సంస్థలు 2022 నుండి 2024 జూన్ మధ్య సుమారు 53 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. వీటిలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై ఉన్నాయి. ఈ కాలంలో లీజుకు తీసుకున్న మొత్తం ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరు ఏకంగా 40 శాతం వాటా కైవసం చేసుకుంది. హైదరాబాద్‌కు 21, చెన్నైకి 14 శాతం వాటా ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ, హైరింగ్ సొల్యూషన్స్ కంపెనీ జాయిన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జీసీసీలు ఇటీవలి కాలంలో తమ భారతీయ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాయి. నైపుణ్యం కలిగిన సిబ్బంది, తక్కువ వ్యయాలు, అనుకూల వ్యాపార వాతావరణం ఇందుకు కలిసి వచి్చంది. ఈ సెంటర్స్ వృద్ధి పథం భారత్‌లోని మొదటి ఆరు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంటుందని అంచనా. అసాధారణ ప్రతిభగల వ్యక్తులు వీటిని నడిపిస్తున్నారు. ఈ అంశం జీసీసీల విస్తరణ, భవిష్యత్తు అభివృద్ధికి వీలు కలి్పస్తుంది. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు తమ జీసీసీల కోసం పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాలను సమకూర్చుకోవడం ద్వారా భారత్ పట్ల తమ దీర్ఘకాలిక నిబద్ధతను ధృవీకరిస్తున్నాయి. -
అదరగొడుతున్న చాట్‌జీపీటీ కొత్త ఫీచర్స్ - వీడియో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికె ప్రపంచ దేశాల్లో అత్యంత పాపులర్ అయిన ఏఐ చాట్‌జీపీటీలో ఇప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం చాట్‌జీపీటీ ఇకపై వినటమే కాదు ఫోటోల రూపంలో సలహాలను కూడా ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ఓపెన్ఏఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పటి వరకు టెక్స్ రూపంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. అయితే మధ్యలో ఏదైనా అడగాలంటే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఇది కూడా సాధ్యమవుతుంది. అంటే చాట్‌జీపీటీ ఏదైనా సమాధానం చెప్పే సమయంలో మధ్యలో మనం కల్పించుకోవచ్చు, దానికి కూడా చాట్‌జీపీటీ సమాధానం ఇస్తుంది. ఇప్పటి వరకు ఏదైనా ప్రశ్న అడగాలంటే మొత్తం టెక్స్ట్ రాయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు సమస్యకు సంబంధించిన ఫోటో షేర్ చేసి సమస్య చెబితే దానికి చాట్‌జీపీటీ సమాధానం చెబుతుంది. ఇక్కడ కనిపించే వీడియోలో మీరు గమనించినట్లయితే సైకిల్ సీటు తగ్గించడానికి ఏమి చేయాలి అని ఫోటో అప్లోడ్ చేసి అడిగితే చాట్‌జీపీటీ దానికి ఆన్సర్ చెబుతుంది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ఈ కొత్త ఫీచర్స్ మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే వాయిస్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఫోటో ఫీచర్ అనేది అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ChatGPT can now see, hear, and speak. Rolling out over next two weeks, Plus users will be able to have voice conversations with ChatGPT (iOS & Android) and to include images in conversations (all platforms). https://t.co/uNZjgbR5Bm pic.twitter.com/paG0hMshXb — OpenAI (@OpenAI) September 25, 2023 -
భారత్ మేథోశక్తిని అమెరికా గుర్తించింది
న్యూఢిల్లీ: భారత్‌కు ఉన్న అపారమైన మేధో మూలధనాన్ని అమెరికా గుర్తిచిందని ఇండస్ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఐఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు గురుప్రసాద్ సౌలే తెలిపారు. సెమీ కండక్టర్ తదితర కీలక రంగాల్లో భారత్‌తో అనుసంధానం కోసం ముందుకు రావడం కీలక పరిణామమన్నారు. భారత్‌ను కేవలం సేవల కేంద్రంగా అమెరికా ఇంక ఎంతమాత్రం చూడడం లేదన్నారు. ఈ విషయమై అగ్రరాజ్య ధోరణలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో గురుప్రసాద్ సమావేశం కావడం గమనార్హం. ‘‘అమెరికా నుంచి సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు బదిలీ అవ్వడం నిదానంగా జరుగుతుంది. కొన్ని టెక్నాలజీలను భారత్‌తో పంచుకునేందుకు అమెరికా నిజంగా సిద్ధంగా లేదు. కానీ ప్రధాని మోదీ పర్యటన తర్వాత భారత్‌లో తయారీ విషయమై చెప్పుకోతగ్గ మార్పు అమెరికాలో వచ్చింది’’అని గరుప్రసాద్ వివరించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్, హెల్త్‌కేర్, ఏఐ రంగాల్లో భారత్ మరింత పురోగమిస్తుందని అమెరికా భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో భారత స్టార్టప్‌లకు అపార అవకాశాలున్నాయంటూ.. చాలా స్టార్టప్‌లకు నాస్డాక్లో లిస్ట్ అయ్యేందుకు ఆదాయం అవసరం లేదన్న విషయం తెలియదన్నారు. -
హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ
ఫార్మా, ఎయిరోస్పేస్, ఐటీ, క్లౌడ్ స్టోరేజీ రంగాలకు హబ్‌గా మారుతోన్న హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఆస్ట్రేలియా టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా ఇండియాలో ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. అందుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఫ్యూచర్ టెక్నాలజీపై ఫోకస్ టెల్ స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో ప్రారంభించబోయే గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), 5జీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై పని చేస్తుంది. టెలికాం, ఇంటర్నెట్ రంగంలో వస్తోన్న నూతన మార్పులను టెక్నాలజిస్టులు పూర్తిగా ఉపయోగించుకోవడంతో పాటు సరికొత్త ఆవిష్కరణలకు ఈ సెంటర్ వేదికగా మారనుంది. టెలికాం రంగానికి సంబంధించి స్థానికంగా ఉన్న సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రానున్నాయి. హైదరాబాద్ సెంటర్లో టెల్ స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో నెలకొల్పబోయే క్యాంపస్‌ను స్పెషలైజ్డ్ హై పెర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ (హెచ్పీఎస్ఈ)గా రూపుదిద్దనున్నారు. టెలికాం సాఫ్ట్వేర్కి సంబంధించి కన్సుమర్ బేస్డ్ డీప్ టెక్నాలజీ ఆవిష్కరణలు ఇక్కడ జరిగే విధంగా హైదరాబాద్ క్యాంపస్ ఉండబోతుంది. ‘త్వరలో తాము ప్రారంభించే ఇన్నోవేషన్ సెంటర్లు టెలికాం రంగంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయని టెల్ స్ట్రా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్టీ అరుణ్‌కుమార్ తెలిపారు. భారీగా విస్తరణ టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా తొలిసారిగా ఆస్ట్రేలియాకి బయట బెంగళూరులో గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్‌ని 2019లో ప్రారంభించింది. రెండేళ కిందట రెండు వందల మందితో ప్రారంభమైన బెంగళూరు క్యాంపస్‌లో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. ఇప్పుడు తొలి ఇన్నెవేషన్ సెంటర్‌ను మించేలా పుణే, హైదరాబాద్‌లలో మరో రెండు క్యాపబులిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు, పూణే, హైదరాబాద్‌లలో కలిపి మొత్తంగా లక్ష చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించాలని టెల్ స్ట్రా లక్క్ష్యంగా పెట్టుకుంది. చదవండి: అమెజాన్ భారీ నియామకాలు -
అక్షరం వస్తే ఒట్టు!
సాక్షి, మహబూబ్‌నగర్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల గురించి ఇటీవలే చేదు నిజాలు బయటపడ్డాయి. కనీసం చదవడం, రాయడం, ఎక్కాలు కూడా రాని స్థితిలో ఉన్నారని తేలింది. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతుండగా చదవు చెప్పిన ఉపాధ్యాయులు ఏం చేద్దామని ఆందోళనలో పడ్డారు. సర్వేలోని నిజాలివే.. విద్యార్థుల కనీస సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం జూలై నుంచి ఏబీసీ పేర వివరాల సేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కనీస సామర్థ్యాలు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడం వంటి అంశాలు ఎంతమేర వస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రభుత్వం గత నెల రెండో వారంలో ఈ ప్రక్రియను ప్రారంభించింది. 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రీ టెస్ట్ నిర్వహించగా అందుకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేసింది. అయితే విద్యార్థులకు మాతృభాష అయిన తెలుగు కూడా చదవడం, రాయడం రాదని, రెండో ల్యాంగేజ్ అయిన ఇంగ్లీష్ కూడా రావడంలేదని బయటపడింది. ఈ పరీక్ష ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న నాణ్యతను ప్రశ్నించే విధంగా ఉంది. సంవత్సరం పొడవునా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తెలుగు చదవడం రాదంటే, పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. ఈ క్రమంలో జూలై 19 నుంచి ప్రారంభమైన ఏబీసీ కార్యక్రమం 60 రోజుల పాటు నిర్వహించి, ఈనెల చివరికల్ల ముగిసే విధంగా అధికారులు ప్రణాళికలు రచించారు. అనంతరం మళ్లి పోస్టు పరీక్ష కూడా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు పరీక్షలు అనంతరం కూడా అధికారులు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం. ఏబీసీ కార్యక్రమం.. ఏబీసీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ప్రీటెస్టులో 80 శాతం మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారిని గ్రూప్ ఏ విద్యార్థిగా, చదవడం, రాయడం అంతంత మాత్రంగా వచ్చిన వారిని గ్రూప్ బీ వారిగా, రాయడం, చదవడం రాని విద్యార్థులను గ్రూప్ సీగా విభజిస్తారు. ఇందులో ఏ గ్రూప్‌లో ఉన్న విద్యార్థులకు సాధారణ తరగతుల్లో సబ్జెక్టులు మాత్రమే బోదిస్తారు. మిగతా రెండు గ్రూప్‌లకు చెందిన విద్యార్థులకు సాధారణ తరగతులతో పాటు, కనీస సామర్థ్యాలు పెంచే విధంగా ఉపాద్యాయులు ప్రత్యేక బోదన చేయాల్సి ఉంది. ఇందులో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సీ నుంచి బీకి, బీ నుండి సీకి వచ్చే విధంగా శిక్షణ కొనసాగుతుంది. ఇలా 60 రోజుల కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మొత్తం ఏ గ్రూప్‌లోకి రావాల్సి ఉంది. పరీక్షలో ఫలితాల సరళి పరీక్షను జూలై నెల 17, 18వ తేదిలో నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 1,439 మంది పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య 1,63,420 మందిగా ఉంది. కానీ పరీక్షకు హాజరైన విద్యార్థులు 75,439 మందిగా ఉంది. ఈ పరీక్ష కేవలం 3వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా(మొదటి ల్యాంగ్వేజ్) ఉర్డూ, తెలుగు రాయడానికి, చదవడానికి రాని విద్యార్థుల సంఖ్య 14,339 మందిగా ఉంది. ఇందులో బాలికలు 7,394 మంది కాగా, బాలురు 6,945 మంది. అంతేకాకుండా ఇంగ్లీష్ చదవడానికి, రాయడానికి రాని విద్యార్థులు 28,543 మంది ఉన్నారు. ఇందులో బాలికలు 14,902 మంది కాగా, బాలురు 13,641 మంది ఉన్నారు. వీటితో పాటు చదుర్విద గణిత ప్రక్రియలు రాని విద్యార్థులు 27,733 మంది ఉన్నారు. అసలు గణితం చదవడం, రాయడం, ప్రక్రియలు రాని విద్యార్థులు 30,149 మంది ఉన్నారు. ఇందులో బాలికలు 15,583 మంది కాగా, బాలురు 14,566 మంది ఉన్నారు. పనితీరుకు నిదర్శనం ప్రీటెస్టు ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సంవత్సరంలో 9నెలలు పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థికి కనీసం మాతృభాషలో కూడా చదవడానికి రాలేని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు ఇంగ్లీష్, సైన్స్, గణితం వంటి వాటిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యానికి తూట్లు పడుతున్నట్లు ఆరోపణలు వినిస్తున్నారు. పరిస్థితి మారాలి, విద్యార్థులకు కనీస సమర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలి, బోధనలో నిర్లక్ష్యం వహించవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా పెద్దగా ఫలితం కనిపిండం లేదు. వీటితో పాటు పదో తరగతి ఫలితాల్లో కూడా ఇలాంటి పరిస్థితే పునరావతం అయ్యింది. జిల్లాలోను రాష్ట్రంలో 30వ స్థానంలో నిలబెట్టారు. ఈ సారి ప్రీటెస్టులో అయిన మంచి ఫలితాలు వస్తాయని, జిల్లా విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామర్థ్యాలు పెంపొందిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాసామర్థ్యాలు తెలుసుకునేందుకు జూలైలో ప్రీ టెస్టు నిర్వహించాం. ఇం దులో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ద్వారా బోధస్తున్నాం. అందుకోసమే ఏబీసీ కార్యక్రమం ని ర్వహించాం. ఈనెల చివరి నాటికి పూర్తి స్థాయిలో విద్యార్థుల విద్యాసామర్థ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – నాంపల్లి రాజేష్, డీఈఓ, మహబూబ్‌నగర్ -
బిగ్ డేటా అనాలసిస్‌తో సామర్థ్యం
జేఎన్టీయూ : బిగ్ డేటా అనాలసిస్‌తో మెడికల్, సోషియల్, సాఫ్ట్వేర్ రంగాల్లో వేగంతోపాటు సామర్థ్యం అలవడుతుంద ని జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య ఎం.సర్కార్ అన్నారు. జేఎ¯ŒSటీయూ అనంతపురంలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ‘అవేర్నెస్ అండ్ కెరీర్ ఆపర్చన్యుటీస్ బిగ్ డేటా అనాలసిస్’ అనే అంశంపై మూడురోజుల పాటు నిర్వహించనున్న సదస్సును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వ్యాపార సంబంధిత లావాదేవీలు, గణాంక విశ్లేషణల్లో బిగ్ డేటా ఉపయోగపడుతుందన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.ప్రహ్లాదరావు, సీఎస్ఈ విభాగాధిపతి ఆచార్య వసుంధర, టీసీఎస్ సీనియర్ కన్సెల్టెన్సీ అండ్ అకడమిక్ మేనేజర్ రిచర్డ్కింగ్ తదితరులు పాల్గొన్నారు.