
సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కుంతియా, ఉత్తమ్, గీతారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పులను మేధావు లు ప్రశ్నించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారా ల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా పేర్కొన్నారు. ప్రశ్నించకుంటే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థక మవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రొఫెషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మేధోమథనం జరగాలని, చర్చ జరిగిన ప్పుడే అలాంటి విషయాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, జీడీపీ తదితర అం శాలపై మేధావులు ప్రత్యేక చర్చలు నిర్వహించా లన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మేధావులు ప్రత్యక్ష రాజకీ యాల్లోకి రావాలని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిం చకపోతే పాలకులు నియంతలుగా మారుతారని అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాల నపై మేధావులు బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. తర్వాత ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసో జు శ్రవణ్‌ను సన్మానించారు. సమావేశంలో గీతారెడ్డి, మల్లురవి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దెదించాలి
- పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి
ప్రజల ఆకాంక్షలను నేరవేర్చకుండా నియంతలా పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి పిలుపునిచ్చారు. లంబాడా హక్కు ల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘మేమెంతమందిమో–మాకంత వాటా’పై ఉమ్మడి రాష్ట్ర సదస్సును ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించగా వారు హాజరై మాట్లాడారు. గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లకు జీవో ఇచ్చి తక్షణమే అమలు చేయాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన దళితులు, గిరిజనులు, నిరుద్యోగుల ఆంకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న సర్కార్ మెడలు వంచేందుకు పోరుబాట పట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment