భవిష్యత్తును చక్కదిద్దుకునే బాటలు | The paths that change the future | Sakshi
Sakshi News home page

భవిష్యత్తును చక్కదిద్దుకునే బాటలు

Published Mon, Jun 26 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

భవిష్యత్తును చక్కదిద్దుకునే బాటలు

భవిష్యత్తును చక్కదిద్దుకునే బాటలు

ఆత్మీయం

మన పూర్వీకులు ఎంతో మేధావులు. దూరదృష్టి కలిగిన వారు. వారు ఏర్పరచిన ఆచార సాంప్రదాయాలన్నీ మానవాళికి మార్గదర్శకాలు. పురాణాలు, ఇతిహాసాలను లోతుగా పరిశీలిస్తే ఒక మనిషి ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి, సమాజ పురోగతికి తోడ్పడే ఎన్నో అంశాలు ఉపాఖ్యానాల రూపంలో దర్శనమిస్తాయి. ఇందులో స్త్రీపాత్రలు ఉన్నత విలువలతో, సమాజాన్ని ముందుకు నడిపించడంతో పాటు చక్కని సందేశాలనిస్తాయి. ముఖ్యంగా పతివ్రతల కథలు స్త్రీల అభ్యుదయానికి మేలుకొలుపుల వంటివి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోనివారు మాత్రమే ఈ కథలు. స్త్రీ స్వేచ్ఛకు ప్రతిబంధకాలని అనుకుంటారు. అయితే ఆయా పురాణాలలోని పతివ్రతలందరూ ఎన్నో విధాలైన కష్టాలు పడినట్లు ఉన్నా, ఎవరూ కూడా అబలలమని కన్నీరు కారుస్తూ చతికిలపడలేదు.

విధినే ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించారు. కన్నవారు, కట్టుకున్నవాడు, సమాజం, చివరకు ప్రార్థించే భగవంతుడు... ఇలా ఎవరివల్ల ఆపద వాటిల్లినా, తాము నమ్ముకున్న సత్యాన్ని ఆచరించడంలో వెనుకడుగు వేయని ఆ ధీరత్వం ముందు సర్వజగత్తు తలవంచి దాసోహమనేలా చేసుకున్న ఆ స్త్రీల ఆత్మస్థైర్యం ఆదర్శప్రాయం. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఆటంకాలు, ఒడుదుడుకులు ఎదురౌతాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని చిన్నతనంనుండే నూరిపోసే క్రమంలో భాగంగానే ఆనాటి పెద్దలు, పురాణాలలోని పతివ్రతల కథలు చెప్పడం వారిని స్మరిస్తూ నోములు–వ్రతాలు చేయించడం అనే ఆచారాలు ఏర్పరచారు. ఆలోచిస్తే...పెద్దల అడుగుజాడలలో ఎందుకు నడవాలో అవగతం అవుతుంది. వారు చెప్పినట్లు పురాణాలు, రామాయణ, భారత భాగవతాలు చదివితే  భవిష్యత్తుకు కావలసిన పాఠాలు నేర్చుకుంటారనే తప్ప వారినేదో చదువులేని దద్దమ్మలుగా వంటింటి కుందేలుగా చేయడానికి కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement