సాక్షి,విజయవాడ: అవినీతి కేసులో మాజీమంత్రి, టీడీపీఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలిపారు. తాము పారదర్శక పాలన అందించామని టీడీపీ గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అరెస్టులు అక్రమమని ఘోషిస్తోందని, అవినీతి చేయకపోతే టీడీపీ నేతలకు భయమెందుకని తీవ్రంగా ప్రశ్నించారు. (జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్)
అవినీతి పరులకు శిక్ష తప్పదని, టీడీపీ హయాంలో రాజధానిలో ఇంసైడర్ ట్రేడింగ్ జరిగిందని కన్నా అన్నారు. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు. పోలవరంలో నిధులు పక్కదారి పట్టాయని, టీడీపీ అవినీతిపై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందని కన్నా గుర్తుచేశారు. ఇక ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.(‘రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలైంది’)
Comments
Please login to add a commentAdd a comment