Kanna Laxmi Narayana
-
ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌కు లేఖ రాయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు సోమవారం తన ట్విటర్ ఖాతాలో.. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాశారని విమర్శించారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (వ్యవస్థలను నాశనం చేయడం మీకు కొత్త కాదుగా!) చదవండి: (ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..) -
టీడీపీ గొప్పలు చెప్పుకుంది: కన్నా
సాక్షి,విజయవాడ: అవినీతి కేసులో మాజీమంత్రి, టీడీపీఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలిపారు. తాము పారదర్శక పాలన అందించామని టీడీపీ గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అరెస్టులు అక్రమమని ఘోషిస్తోందని, అవినీతి చేయకపోతే టీడీపీ నేతలకు భయమెందుకని తీవ్రంగా ప్రశ్నించారు. (జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్) అవినీతి పరులకు శిక్ష తప్పదని, టీడీపీ హయాంలో రాజధానిలో ఇంసైడర్ ట్రేడింగ్ జరిగిందని కన్నా అన్నారు. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు. పోలవరంలో నిధులు పక్కదారి పట్టాయని, టీడీపీ అవినీతిపై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందని కన్నా గుర్తుచేశారు. ఇక ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.(‘రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలైంది’) -
'తప్పును ఒప్పుకొని లెంపలేసుకుంటే బాగుంటుంది'
సాక్షి, విజయవాడ : తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకుంటే బాగుంటుదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మీ పార్టీ నిర్ణయాన్ని మా ప్రభుత్వానికి అంట కట్టవద్దంటూ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ' వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పు ఎప్పుడు..ఎక్కడ జరిగిందనేది పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. ఆనాడు తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ పార్టీ నేతలకు ప్రజలే చెంపదెబ్బలే వేస్తారు. టీటీడీ ఆస్తులను మా ప్రభుత్వమే సంరక్షిస్తుంది. మీ రాజకీయ మనుగడ కోసం, పదవి కాపాడుకోవడానికి భక్తులను, ప్రజలను గందరగోళానికి గురి చేసింది మీరు. మీ పార్టీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ కమిటీలో సభ్యుడిగా ఉన్న బీజేపీకి చెందిన నేత ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలనే నిర్ణయం తీసుకున్నట్లు' పేర్కొన్నారు. మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం టీటీడీ బోర్డుకు సూచించినట్లు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
'దిక్కుమాలిన రాజకీయాలు మానుకుంటే మంచిది'
సాక్షి, విజయవాడ : విజయవాడ కనక దుర్గమ్మ వారధి వద్ద వలస కార్మికులకు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలస కూలీలకు ఆహరం అందజేశారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ' వలస కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రామిక్ రైళ్లు, బస్సులు ద్వారా వారిని స్వస్థలాలకు చేరుస్తున్నాం. వలస కార్మికులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుక్షణం ఆలోచిస్తున్నారు. వలస కూలీలపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనవసర రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి. ('వలస కూలీలు ఇకపై ఇబ్బంది పడకూడదు') కన్నా లక్ష్మీ నారాయణ లెటర్లు రాసి బురద చల్లాలని చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలస కార్మికులు భరోసా ఇచ్చారా....? జూమ్ యాప్ ,టెలీ కాన్ఫరెన్స్‌ల పేరుతో హైదరాబాద్‌లో ఉండి హడావిడి చేస్తున్నారు. కార్మికుల, శ్రామికుల పార్టీలు అని చెప్పుకునే వామపక్షాలు సైతం కుటిల రాజకీయాలు చేస్తున్నాయి. బెంగాల్ వలస కార్మికులను రెచ్చగొడుతున్నారు. బెంగాల్ రాష్ట్ర సీఎం మమతను వలస కార్మికులను తమ రాష్ట్రంలోకి అనుమతించాలంటూ లేఖ పంపాము.. వారి నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ఒక గంట సేపు దీక్ష చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వలస కూలీలకు మంచినీళ్లు అయినా ఇచ్చారా?. విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదు. రెండు నెలల బిల్లులు ఒకేసారి రావడంతో ప్రజలు అధికంగా వచ్చాయన్న బావన లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేసే తోక పార్టీల నాయకులు కరెంటు బిల్లులపై ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎవరు ఉన్నారని వీడియో కాన్ఫరెన్స్ లు పెడతారు... రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు పవన్ కల్యాణ్.టీడీపీ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విపత్తు సమయంలో సైతం జగన్ రైతులకు అండగా నిలిచారు. రైతు భరోసా ఇచ్చి వారిలో దైర్యాన్ని నింపారు. రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. రూ.3 వేల కోట్లతో రైతుల కోసం మూలనిధి ఏర్పాటు చేశారు. రైతు భరోసా రూపంలో ఒక్కో రైతుకు వారి ఖాతాల్లో రూ. 5500 జమచేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు దిక్కుమాలిన రాజకీయాలు మానుకోవాలి' అంటూ తెలిపారు. -
ప్రమాణానికి రెడీ..
-
అవినీతి చేయలేదని కన్నా ప్రమాణం చేస్తారా?
-
మొదటి ముద్దాయి చంద్రబాబు: జీవీఎల్
న్యూఢిల్లీ: రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మంగళవారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి విషయంలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. నాడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని.. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. తాము పెద్దన్నగా వ్యవహరిస్తే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు తాము పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. మొదటి ముద్దాయి చంద్రబాబు ‘రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఆదేశించాలి. అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు చేతగాని వ్యక్తి. చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం. అందువల్లే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదు. అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబు. అమరావతి పేరుతో సేకరించిన నిధులు స్వాహా చేశారు. అమరావతిలో వేల కోట్లు దుర్వినియోగం చేశారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీరును జీవీఎల్ ఎండగట్టారు. కాగా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు జీవీఎల్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.(3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు) అభివృద్ధి వికేంద్రీకరణ మా సిద్ధాంతం.. అభివృద్ధి వికేంద్రీకరణ తమ సిద్ధాంతమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ మొదటి ప్రాధన్యత అని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్‌కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. జనసేనతో కలిసి తాము పోరాటం చేస్తామని... రాజధాని నిర్మాణానికి అదనంగా సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి దుస్థితికి బాబే కారకుడు! -
మహిళా జర్నలిస్టులపై దాడి
-
రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి
సాక్షి, ఉద్దండరాయునిపాలెం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఓ చానల్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో మీడియా ప్రతినిధిపైనా కూడా దాడి చేశారు. మీడియా ప్రతినిధులపైన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా కొందరు దాడికి తెగబడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ మీడియా వాహనానం అద్దాలను కర్రలతో ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మీడియా ప్రతినిధుల మీద రైతులు ముసుగులో కొందరు కావాలనే దాడి చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్ర చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడతున్నారు. అమరావతి ప్రాంతంలో ఏదో జరిగిపోతుందనే తప్పుడు సంకేతాలను పంపించే ఉద్దేశంతోనే.. పథకం ప్రకారం మీడియా ప్రతినిధులపైన దాడి జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీడీపీ నాయకులే అమరావతిలో రైతులతో ఉద్యమం చేపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మీడియా ప్రతినిధులపైన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. గతంలో తాము చాలా సార్లు ఈ ప్రాంతంలో వార్తలు కవర్ చేశామని.. కానీ రైతులు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని పలువురు జర్నలిస్టులు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. -
చంద్రబాబు డైరెక్షన్.. కన్నా యాక్షన్
సాక్షి, కోవూరు: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు. చంద్రబాబునాయుడు డైరెక్షన్లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడు గ్రామంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమ పార్టీ నాయకులకు గౌరవం ఉందన్నారు. అయితే లక్ష్మీనారాయణ వంటి వ్యక్తుల వల్ల ఆ గౌరవం సన్నగిల్లుతోందన్నారు. కన్నాకు గుంటూరులో రౌడీగా ముద్ర ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల విధివిధానాలను అపహాస్యం చేస్తూ కన్నా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఖజానాను ఖాళీ చేసి అప్పుల ఊబిని తమ పార్టీకి అప్పగించడం జరిగిందన్నారు. దానిని ఒక సవాల్‌గా స్వీకరించి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇతర దేశాల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు లాంటి నీచరాజకీయాలు చేసే వ్యక్తితో కన్నా చేయి కలపడం దారుణమన్నారు. చంద్రబాబు, కన్నా వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమి ఒరగదన్నారు. ఎవరెన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీంతో లక్షలాదిమందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సమావేశంలో కాటంరెడ్డి దినేష్‌రెడ్డి, ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, డి.నిరంజన్‌బాబురెడ్డి, మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, ఎస్కే అహ్మద్, సొసైటీ అధ్యక్షులు ములుమూడి సుబ్బరామిరెడ్డి, ఎస్.నరసింహులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, జనసేన నేతలు బీజేపీలో చేరిక
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా మైదుకూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్లికార్జున మూర్తి, కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరినవారిలో మరో 10 మంది న్యాయవాదులు ఉన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని, ప్రభుత్వపరంగా మోదీ, పార్టీ పరంగా అమిత్ షా కలిసి నడిపిస్తున్నారన్నారు. నేడు ప్రాంతీయ పార్టీల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీలతో ప్రయోజనం లేదని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నమ్మి మోదీకి పట్టం కట్టారని చెప్పారు. -
టీడీపీతో పొత్తు పెట్టుకొని నష్టపోయాం: బీజేపీ
సాక్షి, గుంటూరు : టీడీపీ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గురువారం బీజేపీలో చేరారు. వీరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ కండువా కప్పి ఆహ్మనించారు. కేంద్రంలో మోడీ పరిపాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అందుకే అధిక సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. పేదరిక నిర్మూలనే బీజేపీ సిద్దాంతామని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వాల సంఖ్యను ఈసారి మరింత పెంచగలిగామని, టీడీపీలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని రెండు సార్లు నష్టపోయామని, ఇక నుంచి స్వయంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. -
హోదా ఇవ్వడం జరిగేది కాదు : కన్నా
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కర్నూలు నుంచి విజయవాడ వెళ్తూ మార్గంమధ్యలో గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి పిడతల సరస్వతి నివాసానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఎప్పుడో చెప్పారని, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చామన్నారు. ఆ నిధులను అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ భయంగా బతుకుతోందన్నారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తే తప్పకుండా విచారణ చేయిస్తామన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేక టీడీపీ ఇబ్బంది పడుతోందని, రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. మంచి ప్రతిపక్షంగా ఉంటూ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని సంపాదించి 2024లో వైఎస్సార్సీపీకి ప్రధాన పోటీగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, రాచర్ల గేటులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పిడతల సరస్వతి కన్నాను కోరారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, జిల్లా ఇన్చార్జి శశిభూషణ్‌రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు. -
‘భారతీయుడినని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ‘జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏను రద్దు చేసి దేశమంతటా ఒకే రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన ధీరుడు ప్రధాని నరేంద్ర మోదీ’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం పోడూరు మండలం వేడంగిలో బీజేపీ సభ్యత్వ నమోదులో కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరు భారతీయుడు అని సగర్వంగా చెప్పుకునే విధంగా మోదీ సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తామే వాటిని అమలు చేసినట్లు దుష్ప్రచారం చేసిందని టీడీపీని విమర్శించారు. పైగా ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు అందినకాడికి ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు. -
మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు
-
ఆమెను చంద్రబాబు సమర్థిస్తారా?
సాక్షి, విజయవాడ: పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేపట్టిన ర్యాలీపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడికి నిరసనగా విజయవాడలో బీజేపీ నేతలు, కార్యకర్తలు బుధవారం నిరసన చేపట్టారు. డౌన్ డౌన్ మమతా బెనర్జీ అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అమిత్ షాపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తోందని, వెంటనే ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీని సమర్ధిస్తున్న చంద్రబాబు నాయుడిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు రాజకీయ దొంగలంతా ఏకమయ్యారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలకు పాల్పడినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టనున్నారని వ్యాఖ్యానించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు -
‘మమతా బెనర్టీని అరెస్ట్ చేయండి’
సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై జరిగిన దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అమిత్ షాపై రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మమత బెనర్జీ హింసద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్యాం ఉందా అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే రాష్ట్రాలు వారి జాగీరుగా భావిస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాంలో ఇది మంచి పరిణామం కాదన్నారు. బీజేపీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, అయినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. -
‘టార్గెట్ పెట్టి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నారు’
సాక్షి, గుంటూరు : మద్యం వల్ల అత్యాచారాలు, కిరాయి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, టార్గెట్లు పెట్టి మరీ ప్రభుత్వాలు మద్యాన్ని అమ్మిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో.. దశలవారీగా మద్యనిషేధం అమలుపై చర్చా వేదికలో మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్న దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో మద్యం పంపిణీ వల్ల చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలవుతున్నారని పేర్కొన్నారు. మద్యంపై అందరికీ అవగాహనం కలిగించినప్పుడే మార్పు వస్తుందని, వైఎస్ జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేస్తానన్నారని పునరుద్ఘాటించారు. ఇదే కార్యక్రమాని హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఎన్టీఆర్ మద్యనిషేధం చేస్తానంటే మహిళలు చాలా ఆనందించారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే వరకు దిగజారాయి. అనంతపురంలో మంచి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మద్యం వల్ల ప్రభుత్వం రూ.244 కోట్లు ఆదాయం పొందింది. ఆ డబ్బుతో మంచి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంది. చిన్నపిల్లలు సైతం తాగుడుకు అలవాటు పడుతున్నారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ వుండాలి. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తే మద్యాన్ని నిర్మూలించవచ్చ’న్నారు. మాజీ సీఎస్ అజేయ కల్లం మాట్లాడుతూ.. ‘మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు. సమాజం మీద బాధ్యత లేనట్టు వ్యహరించకూడదు. మద్యపాన నిషేధంపై స్వచ్చంద సంస్థలు పోరాటం చేయాలి. దశలవారీగా మద్యపాన నిషేధంపై సమగ్ర చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. ‘మద్యం వల్ల చిన్న చిన్న కుటుంబాలు మరింతగా ఛిన్నాబిన్నం అవుతున్నాయి. డ్రైవర్లు తాగి వాహనం నడిపితే ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డుప్రమాదాలపై సమీక్ష చేస్తే మద్యం వల్ల జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువని తేలాయి. మద్యపాన నిషేధం అమలు చేయలేరా? అని నన్ను చాలామంది అడుగుతుంటారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా అమలు చేయవచ్చ’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. -
కలెక్టర్లపై పొగడ్తలు.. అనుమానాలకు తావు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పదేపదే ఈవీఎంలపై చేస్తోన్న గొడవ పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. దానిని ఎదుటివారిపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందన్నారు. 2014 ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల అధికారిని స్వయంగా వెళ్లి విచారణ జరపాలని కోరతామన్నారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో చంద్రబాబు ప్రచారానికి వెళ్లి సోనియా గాంధీ, ఏపీని బాగా విభజించిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సోనియాగాంధీ ఏపీని బాగా విభజించిందన్నందుకు ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం అబద్ధాలాడే వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారిని కోరితే ఇంతవరకూ స్పందించలేదని తెలిపారు. రూ.50 కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. -
చంద్రబాబుది చింతామణి డ్రామా: కన్నా
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు స్టిక్కర్లు వేసుకుని ఏపీలో లబ్ధిపొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బుధవారం ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బాబు, తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. సత్తెనల్లి నియోజకవర్గంలో పోలీసులే టీడీపీ తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారని ద్వివేదీకి వివరించారు. ఎన్నికల్లో టీడీపీ దురాగతాలకు అడ్డుకట్టవేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు చింతామణి డ్రామాని రక్తికట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది బ్లాక్‌మెయిలింగ్ స్వభావమని, ముందుకాళ్లకి బంధం వేయటంలో ఆయన దిట్టని విమర్శించారు. తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తోన్న ఈసీని బెదిరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బులు, మద్యం ఏరులైపారుతోందని చెప్పారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ పెద్ద డ్రామా క్రియేట్ చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులే టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, పోలీసు వాహనాలు, అంబులెన్స్‌ల్లో డబ్బులు తరలిస్తున్నారని చెప్పారు. బాబు ఓటమిని అంగీకరించారు: జీవీఎల్ చంద్రబాబు నాయుడు ఓటమిని ముందుగానే అంగీకరించారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాక్యానించారు. అధికార పార్టీ ద్వారా వేల కోట్ల నల్లధనం చేతులు మారుతోందని ఆరోపించారు. చంద్రబాబు దిగజారుడు మాటలు రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టినా బాబుకు బుద్ధి రాలేదని అన్నారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితే పారదర్శకంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. పోలింగ్ రోజున కూడా టీడీపీ కుట్రలు పన్నే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ఇన్నాళ్లకు బాబుకు తత్త్వం బోధపడింది
సాక్షి, అమరావతి : ఇన్నాళ్లకు చంద్రబాబుకు తత్త్వం బోధపడినట్టు కనపడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. బాబు సత్యాన్ని గ్రహించారు. రాబోయే ఎన్నికల్లో వెలువడే ఫలితాన్ని ముందుగానే అంచనావేశారు. ఇక తన అనుభవం ఈ రాష్ట్రానికి చాలునని చంద్రబాబు గ్రహించినట్టున్నారు. ఈ ఎన్నికల్లో తాను ఓడినంత మాత్రాన తనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదంటూ.. తనకు ఫ్యామిలీ ఉందని, మనవడు కూడా ఉన్నాడని వేదాంతధోరణిని ఎత్తుకున్నారు. బీజేపీ నాయకుడు కన్నా లక్మీ నారాయణ.. చంద్రబాబు మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘అదిరిందయ్య చంద్రం..! ఇన్నాళ్లకు మీ 40 ఏళ్ల అనుభవంతో మీ భవిష్యత్తు ని సరిగ్గా అంచనా వేసుకున్నారు.. తథాస్తు దేవతలు తప్పక మీ కోరిక నెరవేరుస్తారు. మీ విషయంలో ప్రజలు కూడా అదే భావనతో ఉన్నారు..మరో వారం తరువాత శాశ్వతంగా మీరు మనవడితో పూర్తి సమయం ఆడుకునే అవకాశం ఇవ్వబోతున్నారు.’అంటూ ట్వీట్ చేశారు. -
ఇన్నాళ్లకు బాబుకు తత్త్వం బోధపడింది
-
‘దొంగే.. దొంగ అని అరవటం బాబుకు అలవాటు’
సాక్షి, గుంటూరు : ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ విధులు నిర్వహించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ, ఐపీఎస్‌లపై ఈసీ వేటు వేయడంతో.. చంద్రబాబు ఈసీపై కక్షసాధించేందుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దొంగే దొంగ అని అరవటం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. స్వతంత్రంగా పనిచేసే ఎన్నికల కమిషన్‌కు నోటీస్ ఇవ్వడం అంటే అది రాజ్యాంగ వ్యతిరేకమని, చంద్రబాబు ఈసీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజ్యాంగ విరుద్దంగా పనిచేస్తూ అరాచకం సృష్టిస్తూనే ఉన్నారంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ టీడీపీపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఓ గాలి పార్టీ అని అది ఇప్పుడు డ్రామా కంపెనీగా మారిందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని.. అలాంటి వ్యక్తి మరోసారి సీఎం అయితే ఈ రాష్ట్రానికే ప్రమాదమని పేర్కొన్నారు. చంద్రబాబు తాను చెప్పిందే జరగాలంటూ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. -
ఆయనెవరో తెలుసా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన చర్చకు తెరతీశారు. ఎన్నికల వేళ రాజకీయ వేడి పెంచేలా ట్విటర్లో ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘కేంద్రానికి లెక్కలు చెప్పం.. మీడియాకు నిజాలు చెప్పం.. అయినా నన్ను నమ్మండి ఎందుకంటే నాది కుప్పం.. ఇలా మాట్లాడే ఆయన ఎవరో తెలుసా??’ అంటూ కన్నా ఓ ప్రశ్నను నెటిజన్ల ముందుంచారు. అందుకు హింట్ అంటూ.. ‘వెన్నుపోటుకి వారసుడు.. యూ టర్న్‌కు దగ్గరి చుట్టం’ అని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ ఊసరవెల్లి ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. కన్నా చేసిన కామెంట్లు ఓ రాజకీయ పార్టీని ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తుంది. కన్నా చేసిన ట్విట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. " ప్రజలకి సమాధానం చెప్పం.. కేంద్రానికి లెక్కలు చెప్పం.. మీడియాకి నిజాలు చెప్పం.. ఐనా నన్ను నమ్మండి ఎందుకంటే నాది కుప్పం..! " ఇలా మాట్లాడే ఆయన ఎవరో తెలుసా!?!?!? Hint :-వెన్నుపోటుకి వారసుడు.. U టర్న్ కి దగ్గరి చుట్టం.. pic.twitter.com/HCiIOD5bq5 — Kanna Lakshmi Narayana (@klnbjp) March 13, 2019 -
తక్షణమే ఏపీ డీజీపీని మార్చాలి
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు శుక్రవారం సీఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆధార్, ఓటర్ జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ ప్రజల ఓటార్ ఐడీ కార్డు వివరాలు, ఆధార్ వివరాలు ఉన్న విషయంపై జోక్యం చేసుకోవాలని, థర్డ్ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. (దేశం దాటిన డేటా చోరీ!) ఏపీ డీజీపీని మార్చాలి.. ఏపీలోని అధికార యంత్రాంగం టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని కన్నా విమర్శలు గుప్పించారు. ఓట్ల తొగింపుపై సరైన విచారణ జరగకుండా ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీ డీజీపీని మార్చాలని డిమాండ్ చేశారు.కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ....ఓట్ల తొలగింపుపై థర్డ్ పార్టీ విచారణ జరపాలని ఈసీని కోరాం. నమోదు అయిన నకిలీ ఓట్లను ఈసీ తొలగించాలి. ఏపీ డీజీపీని తక్షణం మార్చాలి. రాష్ట్రంలో అధికార యంత్రాంగం టీడీపీ తొత్తులుగా మారిపోయారు. ఓట్ల తొలగింపుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఓట్ల అక్రమాల జాబితా వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు. ఫారం-7 ఎవరైనా దాఖలు చేయొచ్చని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. దొంగ ఓట్లను తొలగించకుండా ఉండేందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ తప్పుడు పనులు చేస్తోంది. ఆధార్ డేటా, ఎన్నికల సంఘం మాస్టర్ డేటాను చోరీ చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకుంటోంది. సీనియర్ అధికారులు టీడీపీ కార్యకర్తలుగా మారారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. డేటా చోరీపై ఎన్నికల సంఘం విచారణ జరపాలి. ఓటర్ల జాబితాలో అక్రమాలను సరిదిద్దాలి. ఏపీ డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు.