
కన్నా లక్ష్మీనారాయణ
తిరుపతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చక్కెర కర్మాగారాలు, పాల డెయిరీలు మూత పడుతూనే ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేణిగుంట సమీపంలోని గాజుల మాండ్యం చక్కెర ఫ్యాక్టరీని మూయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.
చక్కెర ఫ్యాక్టరీని నమ్ముకున్న రైతులు, కార్మికులు ఇప్పుడు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రైతులు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు గాజుల మాండ్యం చక్కెర ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment