కాపులను భయభ్రాంతులకు గురిచేస్తున్న సీఎం: కన్నా
గుంటూరు వెస్ట్: తుని ఘటనపై కాపులకు సంబంధం లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి, హోం మంత్రి.. మండలాలు, గ్రామాల వారీగా సభకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తూ పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తునిలో జరిగిన సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు ఏమీ చేయకున్నా తనపై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. కేసులకు భయపడేది లేదని, జైళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాపులపై కక్షసాధింపు చర్యలను విరమించుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.