
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వంపై ఆరోపణలు చేసే వారిపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారని.. చంద్రబాబుది శవాల మీద పెంకులు ఏరుకునే తత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొన్న కన్నా మాట్లాడుతూ.. సెక్స్‌రాకెట్, మనీ లాండరింగ్‌కు పాల్పడినవారిని పక్కన పెట్టుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ అంశాన్ని రాజకీయంగా తీసుకోవడం లేదని.. నెలరోజుల్లోగా బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. పోలవరం యాత్రను విహారయాత్రగా చేసుకున్నారని, కుటుంబ సభ్యులతో క్యాట్ వాక్ చేశారని దూషించారు. హుద్‌హుద్ తుఫానుకు చేసిన హడావుడిలో కనీసం పది శాతమైనా తిత్లీ విషయంలో చూపలేదని విమర్శించారు. చంద్రబాబుకు కావాల్సిందే రాజకీయమే కానీ ప్రజాసంక్షేమం కాదని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబుకు మతిమరుపు వ్యాధి వచ్చిందేమో కానీ, ప్రజలు మర్చిపోలేదన్నారు. ఈ ధర్నాలో కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్, పురందేశ్వరి, జీవీఎల్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment