ముఖ్యమంత్రికి మరో ఐదు ప్రశ్నలు | AP BJP Chief Kanna Laxminarayana Send Five Questions To CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సీఎంకు బీజేపీ మరో ఐదు ప్రశ్నలు

Published Wed, Aug 22 2018 1:02 PM | Last Updated on Wed, Aug 22 2018 2:19 PM

AP BJP Chief  Kanna Laxminarayana Send Five Questions To CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ ఎనిమిదో సారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖను రాశారు. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతిపై  కన్నా ప్రతి వారం ఐదు ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. సీఎంకు ఆయన రాసిన ఎనిమిదో లేఖను విడుదల చేశారు. 

-ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర పథకాలకు మళ్లించలేదా అని మొదటి ప్రశ్నను సంధించారు.  ప్రచార పథకాలకు ఇష్టానుసారంగా నిధులు మళ్లించి అన్యాయం చేయడంలేదా అన్ని ప్రశ్నించారు. 

-రాష్ట్రంలోని ఖనిజ సంపద మొత్తాన్ని మీ పార్టీ నాయకులు దోచుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇంత మైనింగ్‌ మాఫియా ఎప్పుడైనా చోటు చేసుకుందా? చివరకు హైకోర్టు చివాట్లు పెట్టే వరకూ స్పందించని  మీ దైర్భాగ్య ప్రభుత్వం ఇంకా అధికారంలోకి కొనసాగే హక్కు ఉందా?

-మీ పార్టీ కార్యకర్తలకు నామినేషన్‌ పద్దతితో ప్రభుత్వ పనులను ఇచ్చారు. దానిపై సీబీఐ విచారణకు సిద్ధమా?

-సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాను సింగపూర్‌ కంపెనీలకు అప్పజెప్పడం అంతరార్థం ఏమిటీ? అక్కడ అవినీతి జరగలేదా?

- ఆర్థిక నిర్వహణలో కట్టుదిట్టనని చెప్పుకునే మీరు 10.32శాతం వడ్డీ బాండ్లను ఎందుకు జారీ చేయవలసి వచ్చిందో వివరించగలరా? అని సీఎంను నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement