
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి చూస్తుంటే ప్రజల రక్తం ఉడికిపోతోందని, మనిషిగా ఉండే అర్హతను ఆయన ఎప్పుడో కోల్పోయారని ట్వీట్ చేశారు. బీజేపీ నేతలపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించారు.
‘మీకు సిగ్గుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను మీవిగా దొంగ ప్రచారం చేసుకోరు. రాష్ట్ర కోసం మీరేదో హెరిటేజ్ డబ్బులు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు భాషను సరిచేసుకోని క్షమాపణలు చెప్పాలి. మనిషిగా ఉండే అర్హతను మీరు ఎప్పుడో కోల్పోయారు. నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, కేంద్ర ఇచ్చిన లక్షల కోట్ల నిధులను దోచేసి ఇప్పుడు మమ్మల్నే తిడతావా?. రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తినేస్తు.. లెక్కలు అడిగితే యూటర్న్ తీసుకుని మాపై నిందలు వేస్తావా’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
@ncbn
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) February 1, 2019
మీ అవినీతి చూస్తుంటే ప్రజలకి రక్తం ఉడికిపోతోంది బాబు గారు.
రాష్ట్రం కోసం మీరేదో హెరిటేజ్ డబ్బులు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు??
సిగ్గు ఉంటే కేంద్ర పథకాలను మీవిగా దొంగ ప్రచారం చేసుకోరు.
మనిషిగా వుండే అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు.
మీ భాషను సరిచేసుకుని క్షమాపణ చెప్పాలి. https://t.co/6urXxP064X
Comments
Please login to add a commentAdd a comment