
సాక్షి, ఢిల్లీ: రాఫెల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇకనైనా ప్రతిపక్షాలకు కనువిప్పుకలగాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ వ్యాఖ్యానించారు. రాఫెల్ పిటిషన్ల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ శుక్రవారం ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత కుటుంబరావు పెద్ద స్కాం బయటపెడతానని చెప్పి లేని కుంభకోణాన్ని సృష్టించారని అన్నారు. ఏనుగు పోతుంటే కుక్కుల మొరుగుతుంటాయని ఎద్దేవా చేశారు.
‘‘తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా కంపెనీ. ఆ కంపెనీకి డైరెక్టర్ చంద్రబాబు నాయుడు. ఆయన గురించి పట్టించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దేశంలో దొంగలు పడ్డారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు బురదలో దొర్లి దానిని ఇతరులకు అంటిచాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ స్నేహం చేస్తే తెలంగాణలో చేతులు కాలినట్లు మళ్లీ కాల్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాపు, వాల్మీకి రిజర్వేషన్ల గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జయల్ ఓరంతో చర్చించాము. చంద్రబాబు వారిని ఏవిధంగా మోసం చేశాడో వివరించాము. త్వరలో రిజర్వేషన్లపై క్లారిటీ వస్తుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment