
కన్నా లక్ష్మీ నారాయణ
గుంటూరు: పోలవరం నిర్మాణ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని, అధికార టీడీపీ ప్రభుత్వం సహకరించకపోయినా పోలవరం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతూ..సబ్ కాంట్రాక్టుల్లో కమిషన్లు, దళిత, గిరిజనుల భూముల పేరుతో టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. పోలవరం పేరుతో ప్రతి సోమవారం చంద్రబాబు క్యాట్‌వాక్‌లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి వస్తోన్న నిధులన్నీ జన్మభూమి కమిటీలు మొదలు, చంద్రబాబు వరకు దోచుకుంటున్నారని విమర్శించారు. రాజధానికి రైతులిచ్చిన భూములతో చంద్రబాబు , లోకేష్‌లు వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 2014లో ఏ కాంగ్రెస్ పార్టీని బాబు తిట్టాడో 2019లో అదే కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment