
సాక్షి, విజయవాడ: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేపట్టిన ర్యాలీపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడికి నిరసనగా విజయవాడలో బీజేపీ నేతలు, కార్యకర్తలు బుధవారం నిరసన చేపట్టారు. డౌన్ డౌన్ మమతా బెనర్జీ అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అమిత్ షాపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తోందని, వెంటనే ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీని సమర్ధిస్తున్న చంద్రబాబు నాయుడిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు రాజకీయ దొంగలంతా ఏకమయ్యారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలకు పాల్పడినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టనున్నారని వ్యాఖ్యానించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment