సాక్షి, విజయవాడ : తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకుంటే బాగుంటుదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మీ పార్టీ నిర్ణయాన్ని మా ప్రభుత్వానికి అంట కట్టవద్దంటూ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ' వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తప్పు ఎప్పుడు..ఎక్కడ జరిగిందనేది పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. ఆనాడు తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ పార్టీ నేతలకు ప్రజలే చెంపదెబ్బలే వేస్తారు. టీటీడీ ఆస్తులను మా ప్రభుత్వమే సంరక్షిస్తుంది. మీ రాజకీయ మనుగడ కోసం, పదవి కాపాడుకోవడానికి భక్తులను, ప్రజలను గందరగోళానికి గురి చేసింది మీరు. మీ పార్టీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ కమిటీలో సభ్యుడిగా ఉన్న బీజేపీకి చెందిన నేత ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలనే నిర్ణయం తీసుకున్నట్లు' పేర్కొన్నారు. మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం టీటీడీ బోర్డుకు సూచించినట్లు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment