
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ ద్వారా తెలిపారు. తిరుపతిలో అమిత్ షా వాహనంపై దాడి, రాష్ట్ర పర్యటనలో తనపై దాడి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై దాడికి పెద్ద కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
వీటిని పరిశీలించి చూస్తే ఏపీలో ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు ఏస్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందని పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతలు దారుణమైన స్థితిలో ఉన్నాయని అనడానికి ఈ దాడే నిదర్శమన్నారు. జగన్‌పై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వమే ఈ దాడులకు బాధ్యత వహించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment