సాక్షి, తూర్పు గోదావరి జిల్లా(రాజమండ్రి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం విడుదలయ్యాడు. బెయిల్ పత్రాలు అందడంతో జైలు అధికారులు శ్రీనివాసరావుని విడుదల చేశారు.
అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'ఆ రోజు సంఘటన అనుకోకుండా జరిగింది. నేను నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా సిద్ధం. వైఎస్ జగన్‌పై కావాలని దాడి చేయలేదు. రైతులు, మహిళలు, ఇతర సమస్యల గురించి వైఎస్ జగన్‌తో మాట్లాడాలనుకున్నాను' అంటూ శ్రీనివాస్ నీతి కబుర్లు చెప్పాడు. తానొక చెఫ్‌నని అందుకే ఆరోజు తన వద్ద మూడు కత్తులు, ఫోర్క్ ఉన్నాయని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment