
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ పొడగింపుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు ఆదివారం నుంచి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నిందితుడి కస్టడీ ముగియడంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని మరికొన్ని రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. వారి వాదనలను తిరస్కరించిన న్యాయస్థానంనిందితుడికి కస్టడీ పొడగింపుకు నిరాకరించింది. దీంతో శ్రీనివాసరావు విశాఖ జైలుకు తరలించారు. అంతకుముందు శ్రీనివాసరావుకు ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కేజీహెచ్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment