విజయవాడ, సాక్షి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ1 నిందితుడు వేముల సతీష్, మంత్రి నారా లోకేష్‌ను కలిశాడు. శనివారం ఉదయం లోకేష్ నిర్వహించే ప్రజాదర్బాకు వెళ్లి.. ఆయనతో ఫొటో దిగాడు.
వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌కు టీడీపీతో లింకులు ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక.. సతీష్ లోకేష్‌ను కలిసేందుకు యత్నించాడు. అయితే ఎందుకనో అది కుదరలేదు. తాజాగా ఓ టీడీపీ నేత సహకారంతోనే ఈ అపాయింట్‌మెంట్ దక్కినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా నాటి సీఎం జగన్‌పై దాడి జరిగింది. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో అదృష్టతవశాత్తూ ఆయన కంటికి పైన భాగంలో మాత్రమే గాయమైంది.
ఈ కేసులో ఏప్రిల్ 18వ తేదీన వేముల సతీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నెల్లూరు జైలుకు తరలించారు. అయితే ఇందులో పొలిటికల్ కాన్‌స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని పోలీసులు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు జగన్‌ను హత్య చేయాలనే కుట్రతోనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత మే 28వ తేదీన విజయవాడ కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో సతీష్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతనికి పలువురు టీడీపీ నేతలు మద్దతుగా నిలవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment