సాక్షి, అమరావతి: తనపై దాడి జరగడానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబు నాయకత్వంలోనే జరిగిందని ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్న టీడీపీ నేతల అవినీతిని ప్రజలకు తెలిజెప్పడం తప్పా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో బుధవారం సాయంత్రం ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీపై టీడీపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రాభివృద్ధికి ఎవరెంత పనిచేస్తున్నారో తెలియజేస్తున్నందున భరించలేక ఇటువంటి భౌతిక దాడులు చేస్తున్నారని వాపోయారు.
ఈ దాడులు అన్నింటికీ కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా చంద్రబాబు నాయకత్వం లోనే జరుగుతోంది. ఇవి అన్నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న హింస దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది.
— Kanna Lakshmi Narayana (@klnbjp) July 4, 2018
Comments
Please login to add a commentAdd a comment