
కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు: అన్నం పెట్టే చేతిని తెగనరికే గుణం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. సొంతంగా ఎన్నికలలో పోటీ చేసే దమ్మూ ధైర్యం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. బాబు మోసగాడు, అవినీతిపరుడు, డ్రామా ఆర్టిస్ట్ అని తీవ్రంగా విమర్శించారు. బాబు తన అనుకూల మీడియాతో మోదీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. నటుడు శివాజీ, మేధావి చలసాని శ్రీనివాస్‌లు బాబు కనుసన్నలలోనే నడుస్తున్నారని ఆరోపించారు.
గోదావరి పుష్కరాల సమయంలోనే బాబు అవినీతి గురించి మాట్లాడానని తెలిపారు. నాలుగేళ్ల క్రితమే బాబు నిజస్వరూపం గురించి బీజేపీ పెద్దలకు వివరించారని కన్నా అన్నారు. డిసెంబర్ 1 నుంచి 16 వరకు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇచ్చిన నిధులు, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పిన వాటితో పాటు చెప్పని వాటిని కూడా చేశామని, ఏపీ అభివృధ్దే బీజేపీ ధ్యేయమన్నారు. చంద్రబాబు మాతో లేకపోయినా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment