
గుంటూరు: టీడీపీపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ నిందితులు, దుర్గగుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే దొంగలే టీడీపీలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేతలు ఉపయోగించే బాష అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై గతంలో కూడా ధర్నా చేశామని తెలిపారు.టీడీపీ అధినేతను తెలంగాణ సీఎం కేసీఆర్ తిట్టగానే అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు..కానీ మోదీని చంద్రబాబు తిట్టినప్పుడు మీరంతా ఏం చేశారని ప్రశ్నించారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని చెప్పారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావును టీవీ లైవ్‌లో పచ్చిబూతులు తిట్టారని చెప్పారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటూ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. శవాల మీద పైసలు ఏరుకునే విధంగా టీడీపీ నేతల ప్రవర్తన ఉందన్నారు. కేంద్రాన్ని తిట్టి సీఎం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, తిత్లీ విపత్తును కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రికి మరో ఐదు ప్రశ్నలు
అలాగే కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ముఖ్యమంత్రికి ఐదు ప్రశ్నలు సంధించారు.
మొదటి ప్రశ్న: పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించుకోగలరా ?
రెండవ ప్రశ్న: ఎస్టిమేషన్లు పెంచి సీఎం రమేశ్‌కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా?
మూడో ప్రశ్న: మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలను కూర్చోబెట్టి వాటాలు పెంచుకోమని చెప్పలేదా?
నాలుగోప్రశ్న: రూ.480 కోట్ల రూపాయలతో నిరుద్యోగులకు ఇచ్చే శిక్షణకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంలో అంతర్యం ఏమిటి?
ఐదో ప్రశ్న: ఐటీ దాడులు చేస్తే రాష్ట్రంలో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు?
Comments
Please login to add a commentAdd a comment