
విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి లాంటి డ్రామా యాక్టర్ మరొకరు లేరని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో కన్నా విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఏపీకి ద్రోహం చేసిందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్‌ను మించిన మంచిపార్టీ మరొకటి లేదంటున్నారు...ఏవిధంగా అర్ధం చేసుకోవాలో ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు మతిస్థిమితం లేని వ్యక్తిగా మాట్లాడుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబుకు బీజేపీ మీద బురద వేయటం, తీయటం అలవాటుగా మారిందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన ప్రాజెక్టులను ఒక్కోటి వివరించి బాబుకు సవాల్ విసిరారు.
ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి అభినందనలు
పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతోన్న వారికి మరోధైర్యం కలగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మార్చి 1న ప్రధాని సభ విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మోదీ సభకు హాజరై ఆయన ఏమి మాట్లాడతారో అనే ఆసక్తి ప్రజల్లో ఉందన్నారు. విశాఖ రైల్వే జోన్ మీద ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment