
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా మైదుకూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మల్లికార్జున మూర్తి, కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరినవారిలో మరో 10 మంది న్యాయవాదులు ఉన్నారు.
విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని, ప్రభుత్వపరంగా మోదీ, పార్టీ పరంగా అమిత్ షా కలిసి నడిపిస్తున్నారన్నారు. నేడు ప్రాంతీయ పార్టీల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీలతో ప్రయోజనం లేదని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నమ్మి మోదీకి పట్టం కట్టారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment