సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వానికి ప్రచారం మీదున్న శ్రద్ద వ్యవసాయం మీద లేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. మీడియా సమావేశంలో కన్నా మాట్లాడుతూ.. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైందని, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేయలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోన్న ఇంతవరకు ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ధ్వజమెత్తారు. కర్నూలు క్వారీలో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment