సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై జరిగిన దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అమిత్ షాపై రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మమత బెనర్జీ హింసద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్యాం ఉందా అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే రాష్ట్రాలు వారి జాగీరుగా భావిస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాంలో ఇది మంచి పరిణామం కాదన్నారు. బీజేపీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, అయినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment