
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గన్నవరం: యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. గన్నవం పోలీసుల సమాచారం మేరకు.. విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన సొంగా శశి, జి.మండలం కవులూరుకు చెందిన కంచర్ల అహల్య (22) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ బంధువులే. అహల్య కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. కొండపల్లిలో ఉంటూ బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న అహల్య మూడు నెలలు క్రితం గూడవల్లి వచ్చి శశితో సహజీవనం చేస్తోంది.
చదవండి: ప్రాణాలు తీసిన ‘పార్టీ’
ఈ నేపథ్యంలో వారి మధ్య విభేదాలు తలె త్తాయి. దీంతో అహల్య ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటికి శశి కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.