Vijayawada: నేడు, రేపు వాణిజ్య ఉత్సవం - 2021 | Today CM YS Jagan Inaugurates Vanijya Utsavam 2021 In Krishna | Sakshi
Sakshi News home page

Vijayawada: నేడు, రేపు వాణిజ్య ఉత్సవం - 2021

Published Tue, Sep 21 2021 7:30 AM | Last Updated on Tue, Sep 21 2021 10:37 AM

Today CM YS Jagan Inaugurates Vanijya Utsavam 2021 In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా: రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవం-2021’ నేడు(మంగళవారం) విజయవాడలో వైభవంగా ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. కాగా, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపు దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న వాణిజ్య ఉత్సవం బుధవారం కూడా కొనసాగుతుంది.

ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

చదవండి: ఎగుమతులకు ప్రత్యేక ప్రణాళిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement