
విజయవాడ: దక్షిణ భారతదేశంలో ప్రముఖ రైల్వే స్టేషన్‌లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో 130 కిలోవాట్స్ సామర్థ్యం గల మొట్ట మొదటి సోలార్ రైల్వే స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ ట్విటర్ లో షేర్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ మొత్తం విద్యుత్ వినియోగంలో 18 శాతం ఈ సౌర శక్తి నుంచి లభిస్తుంది. ఇండియన్ రైల్వే పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవడం వల్ల వార్షికంగా రూ.8 లక్షలకు పైగా పొదుపు కావడంతో పాటు కర్బన ఉద్గారాల శాతం కూడా తగ్గిస్తుందని మంత్రి తెలిపారు.
విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ పీ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌లో 2019 డిసెంబర్‌లో 4, 5 ప్లాట్‌ఫారాలపై 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా అదనంగా రూ.62 లక్షల ఖర్చుతో 4, 5 ప్లాట్‌ఫారాలపై 54 కిలోవాట్స్ 8, 9 ప్లాట్‌ఫారాలపై 11 కిలోవాట్స్ మొత్తం 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌తో ఏర్పాటు చేసారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్‌లలోనే మొదటగా 130 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి గల స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతీయ రైల్వే ట్రాక్షన్ విద్యుత్ అవసరాల కోసం ఖాళీగా ఉన్న రైల్వే భూమిలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. భారతీయ రైల్వే 20 జిజీబ్ల్యు భూ ఆధారిత సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
आंध्र प्रदेश का विजयवाड़ा स्टेशन बना 130 kWp सोलर पैनल से ढका देश का पहला स्टेशन।
— Piyush Goyal (@PiyushGoyal) July 6, 2021
अब स्टेशन की कुल बिजली खपत में से 18% बिजली इसी सौर ऊर्जा से मिलेगी। इससे वार्षिक 8 लाख रुपये की बचत होगी, व कॉर्बन उत्सर्जन में भी कमी आयेगी।
Watch on Koo: https://t.co/rghkl7q4ya pic.twitter.com/B9WYhFMkDk
Comments
Please login to add a commentAdd a comment