
విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ నెల 25వ తేదీన విజయవాడలో నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయలేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
నగరంలో 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్‌పీసీ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. ఈ ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి ముందస్తుగా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment