మట్టి గణపతినే పూజించాలి
ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించి పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన 72 అడుగుల మట్టి గణపతిని సోమవారం రాత్రి ముఖ్యమంత్రి దర్శించుకుని పూజలు చేశారు.
విజయవాడ (మధురానగర్) : ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించి పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన 72 అడుగుల మట్టి గణపతిని సోమవారం రాత్రి ముఖ్యమంత్రి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. మట్టితో పర్యావరణానికి అనుకూలంగా 72 అడుగుల గణపతిని ప్రతిషి్ఠంచి పూజలు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. అనంతరం గణేశుడికి పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో సెల్ఫీలు, వినాయక విగ్రహంతో ఫొటోలు దిగారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, విజయకృష్ణా సూపర్‌బజార్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, కార్పొరేటర్‌లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.