సాక్షి, గుంటూరు, ఒంగోలు: గుంటూరు జిల్లాలో జలవిలయానికి నష్టపోయిన బాధితులను వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదుకున్నారు. జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), సీజీసీ సభ్యుడు జంగాకృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి బాధితులను పరామర్శించారు. నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులకు ఆర్థిక సాయం, అన్నదానం చేశారు.
బాపట్ల మండలం దగ్గుమల్లివారిపాలెంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో పార్టీ పట్టణ కన్వీనర్ దగ్గుమల్లి ధర్మారావు 2 రోజులుగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఒంగోలులోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అద్దంకిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముంపు కాలనీల్లో ప్రజలకు ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు.
బాధితులకు వైఎస్సార్‌సీపీ ఆపన్న హస్తం
Published Fri, Oct 25 2013 1:58 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement
Advertisement