Man Narrowly Escapes Lightning Strikes Road In Hyderabad Attapur - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పిడుగుపాటు.. తృటిలో తప్పించుకున్న యువకుడు 

Published Tue, Jul 25 2023 2:20 PM | Last Updated on Tue, Jul 25 2023 3:22 PM

Man Narrowly Escapes Lightning Strikes Road In Hyderabad Attapur - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్‌లో  మంగళవారం కురిసిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. నిముషాల వ్యవధిలో మొత్తం నగరమంతా నీట మునిగింది. పెద్ద పెద్ద ఉరుములతో కురిసిన వానకు నగరం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ నీరు చేరింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా  రాజేంద్ర నగర్‌లో పిడుగు పడిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో వీర విహారం చేస్తోంది.  అదృష్టవశాత్తు ఒక వ్యక్తి పిడుగుపాటు నుండి తృటిలో తప్పించుకున్నాడు. వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.       

గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎట్టకేలకు వర్షం తెరపినివ్వడంతో  నగర వాసులు ఎవరి పనులకు వారు ఉపక్రమించారు. అంతలోనే మళ్లీ మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పెద్ద ఉరుములతో, ఎరువులతో కురిసిన వర్షానికి నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనదారులైతే గంటల పాటు హోరువానలో తడుస్తూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. వర్షానికి హైదరాబాద్ వీధులన్నీ జలమయమయ్యాయి.   

రాజేంద్ర నగర్‌లో ఒక సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు అందరీ విస్మయానికి గురిచేసింది. వీడియోలో ఒకవ్యక్తి ఒక ఇంటి నుండి మరో నాట్లొకి వెళ్తున్నాడు. అతను అలా రోడ్డు దాటి ఇంటిలోకి వెళ్ళగానే పెద్ద పిడుగుపడింది. ఏ వీడియో చోసిన వారు అదృష్టవశాత్తు అతను ఆ పిడుగుపాటు నుండి తప్పించుకున్నాడు. లేదంటే ఘోరం జరిగి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement