lightening strike
-
బిహార్‌లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
పాట్నా: బిహార్ ప్రజలను పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 10 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.పిడుగుపాటుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం నితీశ్‌కుమార్ తెలిపారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. -
హైదరాబాద్‌లో పిడుగుపాటు.. తృటిలో తప్పించుకున్న యువకుడు
హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. నిముషాల వ్యవధిలో మొత్తం నగరమంతా నీట మునిగింది. పెద్ద పెద్ద ఉరుములతో కురిసిన వానకు నగరం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ నీరు చేరింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రాజేంద్ర నగర్లో పిడుగు పడిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో వీర విహారం చేస్తోంది. అదృష్టవశాత్తు ఒక వ్యక్తి పిడుగుపాటు నుండి తృటిలో తప్పించుకున్నాడు. వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎట్టకేలకు వర్షం తెరపినివ్వడంతో నగర వాసులు ఎవరి పనులకు వారు ఉపక్రమించారు. అంతలోనే మళ్లీ మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పెద్ద ఉరుములతో, ఎరువులతో కురిసిన వర్షానికి నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనదారులైతే గంటల పాటు హోరువానలో తడుస్తూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. వర్షానికి హైదరాబాద్ వీధులన్నీ జలమయమయ్యాయి. రాజేంద్ర నగర్లో ఒక సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు అందరీ విస్మయానికి గురిచేసింది. వీడియోలో ఒకవ్యక్తి ఒక ఇంటి నుండి మరో నాట్లొకి వెళ్తున్నాడు. అతను అలా రోడ్డు దాటి ఇంటిలోకి వెళ్ళగానే పెద్ద పిడుగుపడింది. ఏ వీడియో చోసిన వారు అదృష్టవశాత్తు అతను ఆ పిడుగుపాటు నుండి తప్పించుకున్నాడు. లేదంటే ఘోరం జరిగి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. #HyderabadRains A massive lightening struck on a luckily empty street in Attapur in #Hyderabad during the mad downpour last night. The guy who was seen walking missed it by a whisker. Luckily no one was hurt, some electronics reportedly damaged! #StaySafeHyderabad pic.twitter.com/B9VMs1uvfV — Revathi (@revathitweets) July 25, 2023 ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన -
పిడుగుపాటుకు ఒకే రోజు 9 మంది మృతి!
భోపాల్: పిడుగులు పడి మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. విదిశా, సట్నా, గుణా జిల్లాల్లో పిడుగులు పడి ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సైతం భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. చెట్టుకింద నిలుచోవటమే శాపంగా మారింది.. విదిశా జిల్లాలోని అగసోడ్ గ్రామంలో శనివారం సాయంత్రం వర్షం వస్తుందని నలుగురు ఓ చెట్టుకింద తలదాచుకున్నారు. అయితే.. అదే చెట్టుపై పిడుగు పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోనే జరిగినట్లు సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కున్వర్ సింగ్ ముకటి తెలిపారు. మృతులు గాలు మాలవియా, రాము, గుడ్డా, ప్రభు లాల్‌గా గుర్తించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సింగ్ తెలిపారు. సట్నా జిల్లాలోని పోడి పతౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం సాయంత్రం పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అంజన, చంద్రా, రాజ్‌కుమార్, రామ్‌కుమార్ యాదవ్‌గా గుర్తించారు. గుణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇదీ చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
యూపీలో పిడుగుల వర్షం.. ఒకే రోజు 14 మంది మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పిడుగుల వర్షం కురిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. సహాయ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. బండా జిల్లాలో పడిన పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఫతేపూర్‌లో ఇద్దరు, బలరామ్‌పుర్, చందౌలీ, బలుందర్‌శహర్, రాయ్‌బరేలీ, అమేఠీ, కౌశాంబీ, సుల్తాన్‌పుర్, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుల ఘటనలపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు కమిషనర్. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
పొలం పనుల్లో దంపతులు.. భార్య కళ్లెదుటే కబళించిన మృత్యువు
అనంతగిరి: దంపతులిద్దరూ పొలంలో కలుపుతీస్తున్నారు.. ఉన్నట్టుండి ఆకాశంలో ఉరుములు.. మెరుపులు.. ఒక్కసారిగా పిడుగుపాటు.. తేరుకునేలోగా భర్త విగతజీవిగా కనిపించాడు. తట్టుకోలేక గుండెలవిసేలా రోదించిన భార్య.. ఈ ఘటన వికారాబాద్ మండలం కొటాలగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొటాలగూడెంలో రాందాస్(45), భార్య రామిబాయిలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తనకున్న ఎకరన్నర పొలంలో పత్తి పంట వేయడంతో భార్యతో కలిసి పొలానికి వెళ్లి కలుపుతీసే పనిలో నిమగ్నమయ్యాడు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చి పిడుగుపడటంతో రాందాసు అక్కడికక్కడే కుప్పకూలాడు. పక్కనే ఉన్న భార్య శబ్దం నుంచే తేరుకునే లోపే భర్తవిగత జీవిలా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యింది. రోదనలు విన్న చుట్టుపక్కలా వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ రాములు నాయక్ పోలీసులకు ఫోన్ చేయగా ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జమ్మూలో విషాదం: ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం గమ్‌సార్ ప్రాంతంలో జరిగింది. మెరుపులతో కూడిన పిడుగుపాటుకు ఓ జంట, మరో వ్యక్తి మరణించినట్లు పూంచ్ జిల్లా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రమేష్ కుమార్ అంగ్రాల్ తెలిపారు. మృతులను సూరన్‌కోట్‌లోని లాథోంగ్ గ్రామానికి చెందిన మహ్మద్‌దిన్ కుమారుడు మహ్మద్ హసీక్(38), అతని భార్య జరీనా కౌసర్(30), మరో వ్యక్తి జావేద్ అహ్మద్(38)గా పోలీసులు గుర్తించారు. వీరు పశువుల పెంపకం ద్వారా జీవనం సాగించే సంచార జాతికి చెందినవారని తెలిపారు. పిడుగుపాటుకు పెద్ద సంఖ్యలో జంతువులు కూడా మృత్యువాత పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. (రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం) -
పిడుగుపాటుకు మహిళ మృతి
సాక్షి, విజయనగరం : పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందడంతో పాటు మరో ఏడుగురు మహిళలకు తీవ్రగాయాలైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన 8మంది మహిళలు సమీప గ్రామం సన్యాసయ్య పాలెంలో కూలీ పనులకు వెళ్లారు. వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం రావడంతో ఇళ్లకు బయలుదేరారు. దారి మధ్యలో ఈదురు గాలులు ఎక్కువ కావడంతో చెట్టు దగ్గర తలదాచుకున్నారు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడటంతో అంకమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ఏడుగురు మహిళలకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తక్షణమే 108కి సమాచారం అందించి గాయపడిన వారిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. -
పిడుగును ఫోన్లో బంధించబోయి..
చెన్నై : మొబైల్లో పిడుగు ఫొటోను తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో బుధవారం చోటు చేసుకుంది. వర్షం కురుస్తున్న సమయంలో స్నేహితుడి రొయ్యల ఫాంకు వెళ్లిన రమేష్(43) పిడుగుపాటును ఫోన్లో చిత్రీకరించేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే, పిడుగు అతనికి మరింత చేరువలో పడటంతో ఆ ధాటికి రమేష్ ప్రాణాలు వదిలినట్లు చెప్పారు. ఫాం వద్ద పడివున్న రమేష్‌ను అతని స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. రమేష్ ముఖం, ఛాతి భాగాల్లో తీవ్రంగా గాయాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారని వివరించారు. కాగా, పిడుగుపాటు సమయంలో ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసేందుకు యత్నించొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. -
భారీ మెరుపులు.. బెంబేలు
లండన్: మెరుపు వరదలతో బ్రిటన్ అతలాకుతలమవుతోంది. మంగళవారం రాత్రి బ్రిటన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఆకాశంలో భారీ మెరుపులు కూడా సంభవించాయి. దీంతో కొందరు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు వరదలకు వెరవక.. ప్రాణాలకు తెగించి మెరుపుల సన్నివేశాలను కెమెరాలలో బంధించారు. తర్వాత వాటిని ఫేస్బుక్, ట్వీటర్లలో ఉంచారు. అంతే నెటిజన్ల నుంచి వాటికి భారీగా స్పందన లభించింది. కొందరు ఫోటోగ్రాఫర్ తెగువను మెచ్చుకోగా.. మరికొందరూ జాగ్రత్త అంటూ సూచనలు చేశారు. ఇదిలావుండగా వరదలతో బ్రిటన్‌లోని చాలా ప్రదేశాలు దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రోడ్లు, బీచ్ ప్రాంతాలు కొట్టుకుపోయాయి.