
పాట్నా: బిహార్ ప్రజలను పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 10 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పిడుగుపాటుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం నితీశ్‌కుమార్ తెలిపారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment