lifes
-
బిహార్‌లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
పాట్నా: బిహార్ ప్రజలను పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 10 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.పిడుగుపాటుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం నితీశ్‌కుమార్ తెలిపారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. -
కన్నా!.. యుద్ధమేనా నీకు జోలపాట?
కన్నా! యుద్ధమేనా నీకు జోలపాట? అమ్మ లేదు, నాన్న కనపడడు. ఆకాశంలో వెలుతురు కక్కుతూ కనిపించేది నక్షత్రం కాదు. చెవులు చిల్లులు పడే మోత బడిగంట కాదు.గాలిలో గంధకం వాసన...శిథిలాలలో చిక్కుకున్నఇష్టమైన ఆటబొమ్మ. ఏడుపు ఊరికూరికే వస్తుంది. ఎవరూ నవ్వరు, ముద్దు చేయరు. శోకం పాటలానే ఉంటుంది కానీ అది అమ్మ జోలపాటలా ఉండదు. ఏం జరుగుతోంది? ఈ పెద్దవాళ్లు ఆడుకోవడానికి ఆటబొమ్మలే లేవా? మాతోనే ఆడుకోవాలా? 'ప్రతి యుద్ధం పిల్లలకు వ్యతిరేకమైనదే'. కులం తెలియదు. మతం తెలియదు. జాతి తెలియదు. దేశం తెలియదు. సరిహద్దు తెలియదు. ఆయుధాలూ తెలియవు. మబ్బును చూస్తే నవ్వుతారు. పిట్టను చూస్తే గెంతుతారు. తూనీగతో కబుర్లు చెబుతారు. అఆలు రాయడానికి ఆపసోపాలు పడతారు. పాలబువ్వ తింటూ తింటూండగానే కునుకు తీస్తారు. మట్టితో జత కడతారు. బుజ్జి ఆశలకు మారాము చేస్తారు. బెదిరితే అమ్మ వెనుక దాక్కుంటారు. తమను చూసే ప్రకృతి ఈ పెద్దవాళ్ల ముఖాన నాలుగు చినుకులను చిలకరించి, నాలుగు గింజలు పండించి, నాలుగు నదులను పారిస్తుందని తెలియకనే బుల్లి బుల్లి నడకలతో చిన్నారి దేవతలై తిరుగాడుతారు. ఇటువంటి దేవదూతల కళ్లల్లో రక్తం చిమ్మించే, వీరి ఊపిరి తీయాలని చూసే, యుద్ధం చేసే నేతలను ఏం చేయాలి? శత్రువును ద్వేషించే దాని కన్నా పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తే యుద్ధాలే ఉండవు కొట్టుకోవడం మనుషుల స్వభావంలో ఉన్న అల్ప లక్షణం. మానవచరిత్ర పొడవునా గుంపులుగా కొట్టుకున్నారు. చిన్న చిన్న రాజ్యాలుగా కూడి కొట్టుకున్నారు. దేశాలుగా ఎదిగి కొట్టుకున్నారు. ఇంత నాగరికులం అయ్యామని విర్రవీగుతూ కూడా కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సుశిక్షితమైన సైన్యాలు లేవు. అశ్వికదళం అంటూ ఒకటి అడుగుపెట్టింది కూడా మూడువేల సంవత్సరాల క్రితం ఇనపయుగంలోనే. యుద్ధాల చరిత్రతోపాటు ఆయుధాల పరిణామక్రమం చూస్తే.. రాతి గదల నుంచి విల్లమ్ములు, తుపాకులు, శతఘ్నులు, యుద్ధశకటాలు, నిప్పులు కురిపించే విమానాలు, చివరికి అణ్వస్త్రాల వరకు ఆయుధపాటవం అంచెలంచెలుగా పెరిగి.. యుద్ధాన్ని విద్యగానూ, కళగానూ, వ్యూహనైపుణ్యానికి గీటురాయిగానూ మార్చివేయడం కనిపిస్తుంది. దేశం ఎదగడం అంటే గొప్ప సైనిక శక్తిగా ఎదగడమే. అందుకే ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒక మూలన యుద్ధ సైరన్‌ను మోగిస్తూనే ఉంటోంది. "పిల్లలు యుద్ధాన్ని మొదలెట్టరు. కాని ఏ యుద్ధంలో అయినా వారే ఎక్కువగా నష్టపోతారు" యుద్ధం రెండు దేశాల మధ్య, ఆ దేశాలకు చెందిన సైన్యాల మధ్య.. సాధారణ జనానికి సుదూరంగా ఎక్కడో సరిహద్దుల్లో జరుగుతుందని అనుకుంటాం కానీ యుద్ధమనేది యుద్ధక్షేత్రాన్ని దాటి ఎప్పుడో జనజీవనక్షేత్రంలోకి వచ్చేసింది. ఏ క్షణంలోనైనా శత్రు విమానాలు నేరుగా పౌరుల నెత్తి మీదే బాంబులు కురిపించవచ్చు. బాలలు, స్త్రీలు, వృద్ధులతో సహా ఎవరైనా యుద్ధాగ్నిలో సమిధలు కావచ్చు. ఆసుపత్రులు, స్కూళ్లు వేటినీ వదలరు. ఆధునిక కాలానికి వస్తున్నకొద్దీ పౌర మరణాల దామాషాలో బాలలు కడతేరడమూ పెరిగిపోయిందని చరిత్ర చెబుతోంది. 20 శతాబ్దపు తొలినాటికి యుద్ధ మృతులలో సగం మంది పౌరులైతే, 1980నాటికి అది 90 శాతానికి పెరిగింది. వీరిలో బాలలది ప్రధాన భాగం. గత రెండు దశాబ్దాల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో ఇరవై లక్షలమంది బాలలు చనిపోయారనీ, నలభై నుంచి యాభై లక్షలమంది క్షతగాత్రులయ్యారనీ, కోటీ ఇరవై లక్షలమంది నిరాశ్రయులయ్యారనీ, పది లక్షల మంది అనాథలయ్యారనీ ఐక్యరాజ్యసమితి బాలల నిధి సంస్థ చెబుతోంది. యుద్ధమనేది ఒక్కసారిగా అలా భగ్గుమని, కొన్ని రోజులపాటు కొనసాగి ఆ తర్వాత చల్లారే ఒక విడి ఘటనగా భావిస్తాం. కానీ దాని ప్రభావం బాలలు, స్త్రీలు, క్షతగాత్రులు సహా ఆ తర్వాత అనేకమందికి జీవితకాలమంతటికీ వ్యాపించి సంపూర్ణ జీవనవిధ్వంసంగా మారుతుంది. ఆ విధంగా ఒకే ఘటన అనేక గొలుసుకట్టు ఘటనల కూర్పుగా పరిణమిస్తుంది. యుద్ధం ఒక తాత్కాలిక అవాంతరమనీ, అది తొలగిపోగానే యథాప్రకారం శాంతి నెలకొని స్థిరంగా కొనసాగుతుందనే భ్రమలో కూడా మనం ఉంటాం. కానీ యుద్ధాల చరిత్రను తిరగేస్తే, యుద్ధపరిస్థితే స్థిరంగా ఉంటుందనీ.. శాంతి మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే అతిథి మాత్రమేననే చేదునిజం మన ఊహల్ని చరచి చెబుతుంది. "యుద్ధాలు జరుగుతున్నంత సేపు పిల్లలను ఆకాశంలో దాచి పెట్టేయాలి " – ఒక కవి మనం శాంతికాముకులమా? నిజమేనా? మనం ఇప్పటికీ యుద్ధాన్ని ప్రేమిస్తూ వీరత్వాన్ని ఆరాధిస్తాం. మతాల గాథలలో శౌర్యాన్ని దండిగా నింపుకుంటాం. ప్రతి వాఙ్మయంలోనూ వీరుల చుట్టూ స్తుతిగేయాలే! వీరుడంటే? యుద్ధం చేసేవాడు. శత్రువును చంపడం, వీర మరణాన్ని పొందడం దేశభక్తి. యుద్ధం పవిత్రమైన యజ్ఞంగా రూపుకట్టింది. రోగమొచ్చి చావడం కన్నా, యుద్ధంలో చావడం కీర్తికీ, జీవనసార్థక్యానికీ సంకేతమైంది. బాల్యం నుంచి వీరరసాన్ని ఉగ్గుపాలలో రంగరించి పోయడం పరిపాటి అయింది. యుద్ధంలో నీతి, అవినీతులు.. ధర్మాధర్మాలు.. అన్నీ తలకిందులవుతాయి. నిరాయుధులు, యుద్ధరంగంలో లేనివారు అయిన బాలలను, స్త్రీలను, వృద్ధులను వధించరాదన్న నీతికి పౌరాణిక, చారిత్రకకాలంలోనే కాలదోషం పట్టింది. శత్రురాజ్యాన్ని జయించడంతో ఊరుకోకుండా, శత్రునగరాన్ని దగ్ధంచేసి బూడిద కుప్పగా మార్చడం ఇప్పుడు యుద్ధనీతి. రెండువైపులా జరిగిన సైనికనష్టం, ధననష్టం గురించిన ఆరా తప్ప ఆ మంటల్లో పడి మాడి మసైన బాల్యాల లెక్కలూ, తల్లుల కడుపుకోతల కటికశోకాల సమాచారమూ చిట్టాలకెక్కవు. బతికి బయటపడినా బతుకు అస్తవ్యస్తమై జీవితాంతమూ పెనుభారమైన విషాదకథనాలు వెలుగులోకి రావు. యుద్ధం బాల్యాన్ని చిదిమేసి శేషజీవితాన్ని శవప్రాయంగా మార్చుతుంది. యుద్ధాలలో జీవన్మృతుల సంఖ్యే మృతుల సంఖ్యను ఎన్నో రెట్లు మించి ఉంటుంది. 'యుద్ధంలో గెలిచిన సంపద మొత్తం పసిపిల్లల బోసినవ్వుకు సరిసాటి కాదు' కురుక్షేత్రంలో ఎంత ప్రాణనష్టం జరిగినా అభిమన్యుడు మరణించినప్పుడు ఎక్కువ బాధ కలుగుతుంది. ఎందుకంటే అభిమన్యుడు ఇంకా పసివాడు. ఎంతో భవిష్యత్తు ఉండాల్సిన వాడు. కురుక్షేత్ర యుద్ధం పెట్టిన కడుపుచిచ్చు కన్నతల్లుల వేడికన్నీరుగా ఉబికి ధారకట్టిన వైనాన్ని మహాభారతంలోని స్త్రీపర్వం కడు దయనీయంగా చిత్రించింది. యుద్ధకారకులు ఎవరూ తల్లుల శాపం నుంచి తప్పించుకోలేకపోయారు. అయినా మనిషి గుణపాఠం నేర్చుకోలేదు. రాజ్యాల మధ్య, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే, విజేతలను ఆకాశానికెత్తి, విజితుల భంగపాటును ఎత్తిచూపడమే తప్ప యుద్ధాలు చిదిమేసిన పసిమొగ్గల గురించి, మృతుల కుటుంబాలు ఎదుర్కొన్న కల్లోలం గురించి, విద్యా, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం సహా సమస్తరంగాలనూ.. అంగాలనూ యుద్ధం ఛిద్రం చేసి సమాజాన్ని వెనుకదారి పట్టించడం గురించి చెప్పిన వాఙ్మయాలు అంతగా కనిపించవు. రెండో ప్రపంచయుద్ధాన్నే తీసుకుంటే మృత్యువు తన కర్కశరూపాన్ని ప్రదర్శించిన ఇలాంటి యుద్ధసందర్భం అంతవరకు ప్రపంచ చరిత్రలోనే లేదంటారు. 1940నాటి ప్రపంచ జనాభా 230 కోట్లు అయితే, రెండో ప్రపంచయుద్ధంలో ఏడుకోట్ల నుంచి ఎనిమిదిన్నర కోట్లమంది నాశనమయ్యారు. సైనికులు, పౌరులు సహా నేరుగా యుద్ధంలో అయిదు నుంచి అయిదున్నర కోట్లమంది మరణించారు. యుద్ధకారణంగా వ్యాపించిన రోగాలవల్ల, కరవుకాటకాల వల్ల మరణించిన పౌరుల సంఖ్య అయిదు నుంచి అయిదున్నర కోట్లకు పెరిగి మరణించిన సైనికుల సంఖ్యతో సమానమైంది. బాలల విషయానికే వస్తే, ఈ యుద్ధంలో అంతకుముందు మరే యుద్ధంలోనూ లేనంత పెద్దసంఖ్యలో మృతులవడమో, అనాథలుగా మిగలడమో జరిగింది. నాజీ జర్మన్ నరహంతకులు కోటీ యాభై లక్షలమంది యూదు బాలల ఉసురు తీశారు. వేల సంఖ్యలో రొమానీ (జీప్సీ) బాలలను అంతమొందించారు. అయిదువేల నుంచి ఏడువేల మంది జర్మన్ బాలలు శారీరక, మానసిక వైకల్యాలతో ఆవాసకేంద్రాలకు చేరి ఆహ్లాదకర, ఆశావహ బాల్యాన్ని కోల్పోయి అకాల వృద్ధులుగా గడిపారు. ఏన్ మేరీ ఫ్రాంక్ అనే యూదు బాలిక రాసిన డైరీ బాలల జీవితంలో యుద్ధం కలిగించే కల్లోలానికి అక్షరరూపమిచ్చి చిరస్థాయిగా మిగిలింది. అయినా కనువిప్పు కలగలేదు. యుద్ధాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. బాల్యాలు బేలవై బిక్కచూపులు చూస్తూనే ఉన్నాయి. 'రష్యా పిల్లలైనా, ఉక్రెయిన్ పసికందులైనా, ఇజ్రాయిల్ శిశువులైనా, గాజా చిన్నారులైనా అమ్మ పాలే తాగుతారు' వర్తమానానికి వస్తే.. అటు రష్యా– ఉక్రెయిన్ల నుంచి ఇటు ఇజ్రాయిల్–పాలస్తీనాల వరకు యుద్ధక్షేత్రాలు వ్యాపించి కన్నీటితో చావుపంటలు నిరవధికంగా పండిస్తూనే ఉన్నాయి. శాంతి, సామరస్యాల స్థాపనకు నెలకొల్పిన అంతర్జాతీయ సంస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఉక్రెయిన్ పట్ల రష్యా సాగిస్తున్న మారణకాండ దరిమిలా, గత ఏడాది కాలంగా బాలలు హింసావిలయంలో, భయబీభత్సాల వలయంలో జీవిస్తున్నారు. యుద్ధం ప్రభావితం చేయని వారి జీవనపార్శ్వం ఒక్కటీ లేదు. ఈ యుద్ధం ఇంతవరకు పొట్టన పెట్టుకున్న వెయ్యి మంది పౌరులలో మరణించిన, గాయపడిన బాలలూ అధికసంఖ్యలో ఉన్నారు. మరోవైపు పదిహేను లక్షలమంది బాలలు ఇంటికి, భద్రతకు, చదువుకు, ఆటపాటలకు దూరమై మానసిక, శారీరక అనారోగ్యాలతో ఆందోళనతో నిరాశానిస్పృహల మధ్య గడుపుతున్నారు. తల్లిదండ్రుల వెచ్చని ప్రేమాదరాల కింద గడపాల్సిన పచ్చని బాల్యాన్ని, బంగారుభవితను యుద్ధరాకాసి గుటుక్కున మింగి తేన్చింది. రష్యా–ఉక్రెయిన్ల మధ్య చూస్తున్నది, రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లోనే అతిపెద్ద మారణహోమంగా చెబుతున్నారు. అయితే, నేడు ఇజ్రాయిల్ –పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం దానిని మించిపోయి వర్తమాన యుద్ధచరిత్రను తిరగరాస్తున్నట్టు కనిపిస్తోంది. 2017 నుంచి జరిగిన ఏ ఘర్షణలతో పోల్చి చూసినా గాజా భూఖండంలో జరిగిన పౌరమరణాలు అసాధారణాలూ, కనీవినీ ఎరుగనివీ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరోస్ అంటున్నారు. తాజా ఘర్షణల్లో అటూ ఇటూ కూడా వేలాదిమంది అసువులు వీడారు. వీరిలో బాలలు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇజ్రాయిల్ వైపు పౌరులతో సహా 1300 మంది బాలలు హతమారితే.. పాలస్తీనావైపు 6వేల మంది బాలలుచ 4 వేల మంది మహిళలతో సహా 15వేల మంది నిహతులయ్యారు. నాజీ జర్మనీ రూపంలోని జాతి ఉన్మాదపు కాలసర్పం కాటు తిని, చిత్రహింసా శిబిరాలలో నలిగి నుజ్జయి ప్రపంచం సానుభూతిని చూరగొన్నవారే పాలస్తీనావారిపై అంతకుమించిన హింసకు, ప్రతిహింసకు పాల్పడుతున్నారు. ఆసుపత్రులను సైతం దాడులకు లక్ష్యం చేసుకుని పసిపిల్లలను, రోగులను హతమార్చడం నాజీ అమానుషాలను తలదన్నేదే కానీ తీసిపోయేది కాదు. అప్పుడే పుట్టిన శిశువులను కూడా బాలింతలు అరచేతుల్లో ఉంచుకుని సురక్షితప్రాంతాలకు పరుగుదీయాల్సిన పరిస్థితిని కల్పించడం వెనుక యుగయుగాలుగా ప్రోది చేసుకుంటూ వచ్చిన మంచినీ, మానవత్వాన్నీ కాలరాసే క్రౌర్యమూ కుత్సితమూ ఉన్నాయి. ఆహారంతో సహా అన్ని రకాల నిత్యావసరాల సరఫరానూ అటకాయించే దిగ్బంధమే పది యుద్ధాల పెట్టు. ఒక్కసారిగా కాకుండా అనునిత్యం ఎదుర్కొనే అనేకానేక చావులకు సమానం. 2006 నుంచీ గాజాపౌరులపైన ఇజ్రాయిల్ అలాంటి దిగ్బంధాన్ని అమలు చేస్తోంది. దాంతో గాజా ఆర్థికత దారుణంగా అడుగంటిపోయింది. స్థూలజాతీయోత్పత్తి 30 శాతం పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. 81శాతం జనం దారిద్య్రరేఖకు దిగువున జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది. వైద్యం కోసం కూడా రోగుల్ని బయటకు వెళ్లనివ్వకుండా దిగ్బంధాన్ని అమలు చేయడం జరుగుతోంది. దిగ్బంధమంటే ఒక ప్రాంతాన్నే విశాలమైన చెరసాలగా మార్చి అసంఖ్యాక జనాన్ని బందీలుగా ఉంచడమే! ఆ చెరలో బాలలు, స్త్రీలు, వృద్ధులతో సహా అందరూ బందీలవుతారు. అది బాల్యానికి చెర. వారి చదువుసంధ్యలకు, వారి భవిష్యత్తుకు, వారి శారీరక, మానసిక వికాసానికి ఉరి. ఎదిగే లేతమొక్క లాంటి వారి జీవితాలపై బండ. యుద్ధోన్మాదులందరూ ఒకే జాతి, ఒకే మతం. అందులో జయాపజయాలు, బలాబలాల తేడాలు తప్ప ఇతరేతర భేదాలు ఉండవు. దాని ఫలితమే రెండువైపులా దాడులు, విచక్షణారహితమైన ఊచకోతలు, బాలల బతుకుల్ని బుగ్గి చేసే నొసటి రాతలు. 'ఈ భూమి మోసే అన్ని భారాల్లోకెల్లా అత్యధిక భారం ఏమిటో తెలుసా? పసిపిల్లల శవపేటిక' విజ్ఞత, వివేకం, విచక్షణ సహా అన్నింటినీ మింగేసే అనకొండ యుద్ధం. మనిషి నడవడికి దిక్సూచులుగా నిఘంటువులకెక్కిన ప్రతి ఒక్క మంచిమాటనూ తన రక్తపు వేళ్ళతో చెరిపేసి తన పేరు రాసుకునే మాటే యుద్ధం. పసి చేతులకు ఆయుధాలు అందించి మసి చేయడానికి అది వెనుకాడే ప్రశ్న లేదు. పద్దెనిమిదేళ్ళ లోపు బాలలను యుద్ధాల బరిలోకి లాగడం మధ్యయుగాల నుంచీ, అలనాటి ఫ్రెంచి సైనికశాసకుడు నెపోలియన్ కాలం నుంచీ ఉందని చరిత్రకారులు అంటారు. అమెరికా అంతర్యుద్ధంలో కూడా బాలలు పాల్గొనడం కనిపిస్తుంది. రెండో ప్రపంచయుద్ధంలో బాలలు పాల్గొనడమే కాదు.. నాజీ జర్మనీలో ‘హిట్లర్ యువత’ పేరుతో ‘యుద్ధసేవలు’ అందించారు. నేటి కాలానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాలలోని యుద్ధక్షేత్రాలలో దాదాపు పాతిక కోట్లమంది బాలలు ఉండగా, వారిలో మూడులక్షలమంది సైనికవిధులు నిర్వహిస్తున్నట్టు, వారిలో నలభైశాతం మంది బాలికలున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మంట మిడతలదండును ఆకర్షించినట్టుగా యుద్ధం వయోభేదం లేకుండా అందరినీ ఆకర్షిస్తుంది. యుద్ధవాదులు దానిని అలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. యుద్ధానికీ, శాంతికీ మధ్య విభజనరేఖ చెరిగిపోయి.. అటు నుంచి ఇటూ.. ఇటు నుంచి అటూ నిరంతర చంక్రమణం చేసే పరిస్థితిని లియో తొల్స్తాయ్ ‘యుద్ధం – శాంతి’ నవలలో అనితరసాధ్యంగా చిత్రిస్తాడు. జీవించడమూ, సంపూర్ణంగా జీవితాన్ని ఆనందించి ఆస్వాదించడమే ప్రతి ప్రాణికి ప్రకృతి కల్పించిన సహజాతం. అలాంటిది, యుద్ధపరిస్థితిలో చావే జీవితంగా ఎలా మారిపోతుందో తొల్స్తోయ్ కళ్ళకు కట్టిస్తాడు. రేపటి జీవితం గురించి కమ్మని కలలు కంటూ కంటూనే యువకులు యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టి చావుతోనూ, చావు పరిస్థితులతోనూ ఎలా సహజీవనం చేస్తారో రూపు కడతాడు. ఫ్రెంచి సేనల ముట్టడిలో మాస్కో నగరం దగ్ధమవుతున్నప్పుడు మంటలను తప్పించుకుని ప్రాణాలు దక్కించుకోడానికి తట్టాబుట్టతో వీథిన పడ్డ కుటుంబాల గురించి, సైనికులు చేసిన నిలువుదోపిడీల గురించి, మంటల్లో చిక్కుకున్న తన పసిబిడ్డ కోసం తల్లి పెడుతున్న శోకాలకు కరిగి పియర్ అనే యువకుడు మంటల్లోకి దూకి ఆ పసిపాపను రక్షించడం గురించి రాస్తాడు. పేత్యా అనే పదిహేడేళ్ళ యువకుడు ఉరకలేసే ఉత్సాహంతో యుద్ధంలోకి దూకి కోరి కోరి మృత్యువును కావిలించుకున్నప్పుడు తల్లి కంట వరద కట్టిన దుఃఖాన్ని అక్షరాలకెత్తుతాడు. 'మంచి యూనిఫామ్, తినదగ్గ చాక్లెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు.. పిల్లలకు యుద్ధం లేని నేలను ఇవ్వండి' యుద్ధం బాలల బతుకుపై కలిగించే దుష్ప్రభావాల గురించి అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. యుద్ధప్రభావం పెద్దలపై కన్నా బాలలపై అనేక రెట్లు ఉంటుందన్న సంగతి సాధారణంగా మన ఊహకెక్కదు. యుద్ధ దుష్పరిణామాలతో పెద్దలకన్నా బాలలు ఎక్కువ కాలం జీవించవలసివస్తుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలవుతారు, ప్రేమాదరాల చలవపందిరి కింద గడపవలసిన వయసులో అనా«థాశ్రమాలకు చేరి లేత వయసులోనే పది జీవితాల పెనుభారం కింద అణగిపోతారు. శేషజీవితం వారి ముందు కత్తులబాటలా మారి సుదీర్ఘంగా పరచుకుంటూనే ఉంటుంది. యుద్ధగాయాలు, రోగాలు, మానసిక వైకల్యాలు జీవితాంతమూ వారిని వెంటాడుతూనే ఉంటాయి. జీవితం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని వయసులో ఎదుర్కొనే మానసికమైన ఒత్తిడులను, ఆందోళనలను, భయబీభత్సాలను ఇంకొకరితో పంచుకోలేని మూగలవుతారు. నిర్బంధశ్రమకు గురవడమే కాదు.. బాలికలు మానభంగాలకు ఎరవుతారు. ఒక తరం మొత్తం విద్యా, విజ్ఞానాలకు, గౌరవప్రదమైన జీవితానికి దూరమైనప్పుడు దాని ప్రభావం ఎన్ని తరాలపై పడుతుందో ఊహించుకోగలం. అయినా మనలో వివేకం మేలుకోవడం లేదు. యుద్ధదేవతకు ఎంత విధ్వంసాన్ని, ఎన్ని ప్రాణాలను, భావిజీవితం చుట్టూ పేర్చుకునే ఎన్నెన్ని అందమైన కలల ఛిద్రాలను నైవేద్యం చేస్తున్నామన్న ఎరుక లేదు. ఎన్ని పసిదనాలు వసివాడిపోయి రేపటి ప్రపంచమనే పూదోట మన కళ్ళముందే ఎలా వల్లకాడుగా మారిపోతోందోనన్న విజ్ఞత లేదు. సకల రకాల యుద్ధాలకూ వ్యతిరేకంగా మానవాళి ఇప్పటికీ ఒక్కపెట్టున గళం ఎత్తడంలేదు. యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఈ నిర్విరామ యుద్ధంలో శాంతి గెలిచేదెప్పుడు? బాలల జీవితాలు వేయి రేకుల కలువల్లా విప్పారి కాంతులను నింపేదెప్పుడు? కె.భాస్కరం (చదవండి: ఎన్నికల సీన్ ఎక్కడైనా సేమ్ టు సేమ్! ఆకాశాన్ని తాకే వాగ్దానాలు.. తారలతో తోరణాలు..) -
ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్
అనంతపురం సిటీ: కుటుంబాన్ని వద్దనుకుని ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త... పిల్లల సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడారు. వివరాలు.. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన రామానాయుడు భార్యాబిడ్డలతో కలసి నగరంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్నాడు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి 13 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల వయస్సు కలిగిన కొడుకును చూసుకుంటూ రామానాయుడు రోజులు నెట్టుకొచ్చాడు. భార్య కాపురానికి రానని తేల్చి చెప్పడంతో మనస్తాపం చెందిన అతను తన ఇద్దరు బిడ్డలతో కలసి నాయక్‌నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాడు. వారిని గమనించిన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించడంతో నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ తక్షణమే స్పందించి బ్లూకోట్ సిబ్బందిని రైల్వే ట్రాక్ వద్దకు పంపారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురిని కాపాడి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా బ్లూకోట్ సిబ్బందిని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ జాకీర్, రైల్వే సీఐ నాగరాజు అభినందించారు. (చదవండి: అర్హులైన రైతులందరికీ ఉచిత పంటల బీమా పరిహారం) -
కాలక్షేపం కోసం ఆడిన ఆన్లైన్ గేమ్‌లు...సైబర్ జూదం ఊబిల్లో ..
బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాతో మరో నష్టం మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులతో అతిగా మొబైల్స్‌ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది. పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ తెలుసుకుని గేమ్స్‌కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు. డబ్బు తగలేసిన టెక్కీ ఒక టెక్కీ పోకర్ అనే ఆన్లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది. వీధిన పడ్డ క్యాషియర్ బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు) -
పండుటాకులకు అండగా...
పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి ముద్దుగా పెంచుకుంటారు తలిదండ్రులు. ఆ పిల్లలే పెద్దయి అమ్మానాన్నలను పనికిమాలిన వస్తువులుగా భావిస్తూ ఇంటి బయట పారేయడానికి సిద్ధపడుతున్నారు. అమ్మానాన్నా అంటే ఆస్తులు సంపాదించి ఇచ్చే యంత్రాలుగానే భావిస్తున్నారు. తమ కలల్ని, ఆస్తులను పిల్లలకు పంచి ఇచ్చిన తల్లిదండ్రులు జీవిత చరమాంకంలో అయినవారి అండ లేకుండా అనాథలుగా మారుతున్నారు. కమలమ్మ భర్త చనిపోతే తానే అన్నీ అయ్యి కొడుకును పెంచి పెద్ద చేసింది. కొడుకు కూడా బాగా చదువుకున్నాడు. పెళ్లి చేసింది. కోడలు కూడా బాగా చదువుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. డెభ్బై ఏళ్ల వయసులో కమలమ్మకు క్యాన్సర్ వచ్చింది. ‘ఏడాదికన్నా బతకద’ని డాక్టర్ చెప్పారు. ఆ రోజు నుంచి మొదలు ఇంట్లో ‘మీ అమ్మను ఎక్కడైనా హోమ్‌లో పెట్టండి. పిల్లలకూ ఈ జబ్బు వస్తుంది..’ అని కోడలు రోజూ కొడుకుతో చెప్పే మాటలు వింటూనే ఉంది కమలమ్మ. వృద్ధాశ్రమంలో పెట్టను అన్నాడు కొడుకు. గొడవలు ముదిరి కోడలు వేధింపుల కేసు పెట్టేంత వరకు వెళ్లింది. అందులో అత్తగారి మీద కూడా కేసు పెట్టింది. చివరి దశలో ఉన్న కమలమ్మ మానసిక వ్యథ అంతా ఇంతా కాదు. మరో ఆరు నెలలు బతికేది రెండు నెలలకే కన్ను మూసింది. అన్నపూర్ణ, పరంధామయ్యల కొడుకు బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడ్డాడు. వాళ్లిద్దరూ హైదరాబాద్‌లో ఉంటారు. ఓ రోజు కొడుకు వచ్చి ‘నాతో పాటు వచ్చేయండి అన్నాడు. ‘సరే’ అన్నారు తల్లిదండ్రి. మీరు అమెరికా వచ్చేశాక ఇక్కడ ఆస్తులు ఎందుకు?’ అన్నాడు. ఆస్తులన్నీ అమ్మించేసి క్యాష్ అయ్యాక అమెరికా బయల్దేరారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక తల్లిదండ్రులని బయట కూచోబెట్టి వివరాలేవో కనుక్కొని వస్తానని చెప్పి లోపలికెళ్లాడు. వాళ్లిద్దరూ ఎదురు చూసి చూసీ తమ కొడుక్కి ఏదో జరగరానిది జరిగిందని ఏడుస్తూ కూచున్నారు. కొడుకు వివరాలు చెప్పి అక్కడి సిబ్బందిని కనుక్కొంటే అతను ఎప్పుడో అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడని తెలిసి షాకయ్యారు. వసుధ వయసు 80 ఏళ్లు. ముగ్గురు కొడుకులు. కూతురు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్లే. భర్త ఉన్నప్పుడు పిల్లలకు ఆస్తులు పంచి ఇచ్చాడు. భర్త చనిపోయాక వసుధ పిల్లల ఇంట్లో నెల రోజుల చొప్పున ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఓ రోజు హాస్పిటల్లో చెకప్ కోసమని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర వదిలేసిపోయారు. వసుధ తన పిల్లల పేర్లు, వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. లక్ష్మీబాయమ్మకు నెలనెలా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. పెన్షన్ వచ్చే ముందు రెండు రోజులు తల్లితో బాగానే ఉంటాడు కొడుకు. పెన్షన్ తీసుకోవడానికి ఆఫీస్ వరకు బండిమీద తీసుకొని వెళతాడు. తల్లి పెన్షన్ తీసి కొడుకు చేతికి ఇవ్వగానే అవి జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్లిపో .. అని అక్కడే వదిలేసాడు. మళ్ళీ పెన్షన్ వచ్చే రెండు రోజుల మందు వరకు లక్ష్మీబాయమ్మ అర్ధాకలితో కాలం గడపాల్సిందే. పిల్లలదే బాధ్యత ఇలా పిల్లల చేత నిరాదరణకు గురైన పెద్దల సంఖ్య దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతోంది. కన్నపిల్లలే కాదన్నాక ఇంకెవరిని నమ్ముతాం అనే నైరాశ్యంలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ‘చాలా మంది తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని పెంచడమే అంటుంటారు. కానీ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఉందనే విషయాల గురించి ఆలోచించరు’ అంటారు పి.శ్యామ్‌కుమార్. హెల్పేజ్ ఇండియా అడ్వొకసీ ఆఫీసర్ అయిన శ్యామ్ కుమార్ వయోవృద్ధులకు ఉన్న హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకుని, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందం’టారు. ‘వృద్ధుల మీద 498ఎ కేసులూ నమోదవుతున్నాయి. కోడళ్లు పెట్టే గృహ హింస కేసులను ఇంట్లో పెద్దలు వారు చనిపోయే దశ వరకు ఎదుర్కోవలసి వస్తుంది’ అంటూ ఆవేదన చెందారు రాజేశ్వరి. తోడునీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమె. ‘పిల్లలు తల్లిదండ్రులకు ఉండటానికి వసతి, తిండి, బట్ట.. వంటివి తప్పక ఇవ్వాలి. పిల్లలు ఏ ఆదాయాన్ని కలిగి ఉన్నా సెక్షన్ 23 ప్రకారం దాదాపు 10 వేల రూపాయల వరకు తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఇవ్వాలి. పిల్లలు వారిపై నిర్లక్ష్యాన్ని చూపితే అది మోసం, బలవంతంగా ఆస్తులు లాక్కోవడం వంటి నేరాల కిందకే వస్తుంది.సెక్షన్ 23 ప్రకారం తల్లిదండ్రుల బాధ్యత కొడుకులు–కూతుళ్లు, కోడళ్లు–అల్లుళ్లు, బంధువులది కూడా’ అని వివరించారు. తిరిగి ఆస్తిని పొందవచ్చు ‘తల్లిదండ్రులు తమకోసం ఏమీ ఉంచుకోకుండా ప్రేమతో పిల్లలకు ఆస్తి అంతా రాసిస్తారు. చివరకు ఆ పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోరు. ఇలాంటప్పుడు నేరుగా కోర్టుకు అప్పీల్ చేసుకొని తమ ఆస్తులను తిరిగి పొందవచ్చు. వయోవృద్ధులకు సంబంధించిన కార్యాలయం, రెవిన్యూ డివిజన్ ఆఫీస్‌కు నేరుగా కంప్లైంట్ ఇవ్వచ్చు. మంచానికే పరిమితమైన వారి తరపున ఎవరైనా అప్పీల్ చేయవచ్చు. ►సెక్షన్ 11 కింద డిడబ్ల్యూవో జిల్లా స్థాయిలో మెయింటెన్స్ ఆఫీసర్ జడ్జిమెంట్‌ను ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే వారి సంరక్షణ ఏవిధంగా ఉందనే విషయం ప్రతీ నెలా, మూడు నెలలకు ఓసారి ఆ ఆఫీసర్ పర్యవేక్షిస్తుంటారు. ►అయినప్పటికీ పిల్లలను సరిగా పట్టించుకోకపోయినా, వృద్థులను ఎవరైనా వేధించినా సెక్షన్ 24 ప్రకారం క్రమినల్ చర్యలు తీసుకుంటారు.. మూడు నెలల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధించే అవకాశాల ఉంటాయి. రక్షణగా ఉండాలి యువతరంలో స్వార్థం బాగా పెరిగింది. నేను– నా ఇల్లు –నా పిల్లలు ఇదే నా కుటుంబం అనుకుంటున్నారు. తల్లిదండ్రుల విషయానికి వస్తే భారంగా ఫీలవుతారు. చిన్న కుటుంబాలు పెరిగాక శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వృద్ధుల వల్ల ఏమీ ప్రయోజనం లేదని పిల్లలు భావిస్తున్నారు. ఇది తప్పు అని తెలియజేయాల్సిన అవసరం సమాజానికి, ప్రభుత్వానికి ఉంది. నిరాదరణకు గురవుతున్న పెద్దలు కోర్టుకు అప్పీలు చేసుకుంటే 90 రోజుల్లోనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృద్ధుల ఆరోగ్య రక్షణలో భాగంగానూ ప్రతీ ఏరియా హాస్పిటల్స్‌లో విడిగా జీరియాట్రిక్ వార్డు ఉండాలి. ఓపీల దగ్గర, మెడిసిన్స్ దగ్గర విడిగా క్యూ లైన్ ఉండాలి. ఉమ్మడి కుటుంబంతో కాకుండా పెద్దలకు విడిగా హెల్త్ కార్డు ఉండాలి. పెద్దలు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొన్నట్టు గుర్తిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని మాకు తెలియజేయవచ్చు. రాజేశ్వరి, తోడునీడ స్వచ్ఛంద సంస్థ, స్టేట్ కౌన్సెల్ మెంబర్ ఫర్ సీనియర్ సిటిజిన్స్, తెలంగాణ సమస్యల పరిష్కారానికి.. వృద్ధులు నిరాదరణకు గురైతే వారి పోషణ ఖర్చును పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద పొందవచ్చు. ఇందుకోసం ఒక శాఖ పనిచేస్తోంది. వయోవృద్ధుల సంరక్షణ కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, నేరుగా బాధిత వృద్ధులను కలుసుకొని సమస్యలను పరిష్కరించడం దిశగా ఈ కమిటీæ పనిచేస్తుంది. బాధిత వృద్ధులు ఎవ్వరైనా, వారి తరపు వారైనా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా టోల్‌ఫ్రీ నెం: 18001801253 కు ఫోన్ చేయచ్చు. గూగుల్‌లో ఏ్ఛ p్చజ్ఛ ౖ యాప్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. పి.శ్యామ్‌కుమార్. టిఎస్ అండ్ ఎపి హెల్పేజ్ ఇండియా అడ్వొకసీ ఆఫీసర్ -
ప్రాణం తీసిన పెద్ద నోటు..!
-
మా బతుకులు ఆగం చేయెుద్దు
గోడు వెల్లబోసుకున్న మేడిగట్ట రైతులు గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే పుట్ట మధు ఆదుకుంటామని భరోసా మంథని : ‘అయ్యా.. తెలంగాణకు నీళ్లిచ్చే మేడిగడ్డ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు. మావి అత్యంత విలువైన నల్ల రేగడి భూములు. ఒక రైతు సగటున ఎకరాకు కోటి రూపాయలు సంపాదించుకుంటడు. ఇంత విలువైన భూములను కూడా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ మా బతుకులను ఆగం చేయొద్దు. మమ్మల్ని బజారున పడేయకండి’ అని మేడిగడ్ట రైతులు ఎమ్మెల్యే పుట్ట మధు ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. మంథని గ్రామపంచాయతీ కార్యాలయంలో మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులతో ఎమ్మెల్యే శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను వివరించారు. ఆధారం కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం, చదువుకున్న యువకులకు ఉపాధి, భూములు కోల్పోతున్న వారికి ఉపాధి కల్పించాలని విన్నవించారు. న్యాయం చేస్తారనే నమ్మకంతోనే భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడిగడ్డ గ్రామస్తులు తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే గొప్ప వ్యక్తులని వారిని కచ్చితంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. భూములు కోల్పోయే రైతులకు పరిహారంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లి ఆదుకుంటామని తెలిపారు. సమావేశంలో అంబట్పల్లి సర్పంచ్ మాధవరావు, మహదేవపూర్, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాసరావు, ఆకుల కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ రైతులను భయపెట్టొద్దు మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న మంథని డివిజన్లోని మహదేవపూర్,కాటారం, కమాన్‌పూర్ మండలాల్లోని రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. మండలంలోని బొమ్మాపూర్, సూరారం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టడాన్ని తాము తప్పుపట్టడం లేదన్నారు. ఈ నిర్మాణంతో వేల ఎకరాల భూములు ముంపుకు గురవుతాయని తెలిపారు. దళితులకు పంచేందుకు మహదేవపూర్ మండలం అంటబ్పల్లి గ్రామంలో ప్రభుత్వమే ఎకరానికి రూ.5.15 లక్షలు చెల్లించి భూమి కొనుగోలు చేసిందని తెలిపారు. అదే గ్రామంలో ముంపునకు గురయ్యే అసైన్డ్ భూమికి మాత్రం కేవలం రూ.3 లక్షలే ఇస్తామనడం అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యువ రైతులను సర్వే అధికారులు, పోలీసులు భయపెడుతున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు నీటిని తరలించడానికే సీఎం కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ, సూరారం, కన్నేపల్లి, అన్నారం, సుందిళ్ల, దామెరకుంట, తదితర గ్రామాల రైతులు తమ విలువైన పంట భూములను కోల్పోనున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నీళ్లతో ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతామని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భూమి పోతుందనే బెంగతో ఆత్మహత్య చేసుకున్న సూరారం మహిళా రైతు చల్లా స్వరూప కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీధర్‌బాబు వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, కాంగ్రెస్ నాయకులు గోమాస శ్రీనివాస్, విలాస్‌రావు, గుడాల కృష్ణమూర్తి, కామిడి శ్రీనివాసరెడ్డి, షకీల్, రాణీబాయి, వరప్రసాద్, ప్రభాకర్‌రెడ్డి, రవిచందర్, గోగుల మధు, కృష్ణమోహన్ ఉన్నారు. -
జీవితాలను కల్తీ చేసిన కాలం
డేట్లైన్ హైదరాబాద్ సోమవారం నాటి ‘సాక్షి’ దినపత్రిక లోపలి పేజీలలో ‘ఆగని కల్తీకల్లు మరణాలు’ శీర్షికన ప్రచురించిన వార్తలోనే ఆసక్తి కలిగించే మరో చిన్నవార్త గుండ్రటి బాక్స్‌లో కనిపిస్తుంది. ఆ బాక్స్ ఐటమ్ సారాంశం ఏమిటంటే పది రోజులపాటు కల్తీకల్ల్లు బాధితులతో కిటకిటలాడిన మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల్ల మండలం బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆదివారం తాకిడి తగ్గింది అని. తిరగబడ్డ వాస్తవం రోగులు రాకపోతే, రోగాలు తగ్గుముఖం పడితే అదో వార్త కావాలి. ఆస్ప త్రులు ఖాళీగా ఉంటే జనమంతా సంతోషించాలి. కానీ ఇక్కడ అది పూర్తిగా తిరగబడింది. అదే వార్తలో ఇంకా కొంచెం ముందుకుపోయి చదివితే, కల్తీ కల్లు బాధితుడు ఒక్కరు కూడా ఆదివారం ఆస్పత్రిలో చేరలేదు అని ఉంటుం ది. అంతకుముందు పదిరోజులపాటు ఇదే ఆస్పత్రిలో 13 మంది కల్తీకల్లు బాధితులు చనిపోయారు. మరో వందమంది దాకా చికిత్స తీసుకున్నారు. వింతచేష్టలు, మరణాలతో అట్టుడికిన ఆస్పత్రి ప్రాంగణం ఆదివారం ప్రశాం తంగా కనిపించడంతో డాక్టర్లు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ చివరి వాక్యం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ వాక్యం గురించే ఇప్పుడు చర్చించుకోవాలి. బాధపడాలి, ఆందోళన చెయ్యాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఇంతకీ ఆ వాక్యం అంతరార్థం ఏమిటి? మత్తు కలిపిన కల్లు, అంటే కల్తీకల్లు మళ్లీ దొరుకుతున్నందు వల్లనే బాధితులు తగ్గిపోయారనే. కల్తీ కడుపులో పడక చావులా? గత పక్షంరోజులలో తెలంగాణలో చాలా జిల్లాల నుంచి ఇటువంటి వార్తలు వరసగా ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ఇందులో వింతేముంది అని ఎవరైనా అనుకోవచ్చు. మామూలుగా మనం ఏమనుకుంటాం? కల్తీకల్లు, కల్తీ సారా తాగేవాళ్ల ఆరోగ్యాలు పాడైపోతాయి. దానితో చనిపోతారనే కదా! కల్తీ జరిగిన ఆహారం తింటే మనుషులూ, కల్తీమందులు చల్లితే చెట్లూ, పంటలూ కూడా చనిపోతాయని కదా మన అవగాహన. ఇలాంటి సర్వ సామాన్యమైన మన అవగాహన ఈ సందర్భంలో దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పుడు తెలం గాణలో జరుగుతున్న తంతు ఏమిటంటే జనం కడుపులోకి కల్తీ వెళ్లక అనా రోగ్యం పాలవుతున్నారు. చనిపోతున్నారు కూడా. ఏమిటీ విచిత్రం? ‘ఆగని కల్తీకల్లు మరణాలు’ అని వార్తలకు శీర్షికలు ఉంటాయి. సామాన్యులు ఇది చూసి ఏం అర్థం చేసుకుంటారు? ఓహో! కల్తీకల్లు తాగడం వల్లనే జనం చని పోతున్నట్టున్నారు అని కదా అనుకుంటారు. అయినా కల్తీకల్లును నిరోధించ కుండా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఈ బాగోతం చూస్తూ కూర్చోడానికేనా ఓట్లేసి గెలిపించింది? అని తిట్టుకుంటారు కూడా. పాపం, ఈ ఉదంతంలో ప్రభుత్వాన్ని నిందించవద్దండీ! ఈ మరణాలూ, అనారోగ్యాలూ కల్తీకల్లు తాగినందువల్ల కాదు, తాగడానికి ఆ కల్తీకల్లు అందుబాటులో లేనందువల్ల. ఈ వ్యాసం ఆరంభంలో బాదేపల్లి ఆస్పత్రి ప్రస్తావన తెచ్చింది అందుకే. కల్తీ కల్లును అడ్డుకునేందుకు మన ఆబ్కారీ శాఖ గత కొద్దిరోజులుగా నడుం బిగించి, దాడులు చేసి ఎక్కడికక్కడ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఏళ్ల తరబడి ఆ మత్తుకు బానిసలైనవాళ్లు తీవ్రమైన ఇబ్బందులలో పడిపోయారు. అది దొరక్క అనారోగ్యం పాలై, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఆస్పత్రుల పాలవుతు న్నారు. వారిలో కొందరు చనిపోతున్నారు కూడా. కల్తీకల్లు ప్రవాహం మీద విరుచుకుపడాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే కల్తీ ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించవలసిందే. కల్తీ ఆహారం, కల్తీ మద్యం, కల్తీ పురుగుల మందులు, కల్తీ ఎరువులు వైగైరా వైగైరా. అన్ని కల్తీలతో పాటు కల్తీ రాజకీయాలను కూడా. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీకల్లును అరికట్టేందుకు నడుం బిగించిన ఆబ్కారీ శాఖ సంకల్పం ఏమై నట్టు? మళ్లీ కల్తీకల్లు దొరుకుతున్నందు వల్లనే బాదేపల్లి ఆస్పత్రికి రోగులు రావడం లేదన్న వార్త అంతరార్థం ఏమిటి? ఆకస్మిక నిర్ణయాలతో వచ్చిన తంటా ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం! ఆలోచనారహితమైన, లోపభూయిష్టమైన, ఆకస్మికమైన ప్రభుత్వ నిర్ణయాలు చే టు చేస్తాయని తెలంగాణ రాష్ర్టంలో మద్యపానం వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు గొప్ప ఉదాహరణగా మిగులుతాయి. ప్రస్తుతం తెలంగాణలో కల్తీకల్లు అందుబాటులో లేక సంభవిస్తున్న మరణాలు, రోగా లతో జనం ఆస్పత్రుల పాలు కావడానికి గల నేపథ్యాన్ని గురించి మాట్లాడు కుంటే ఈ పరిస్థితి అంతటికీ ప్రభుత్వమే జవాబుదారీ అవుతుందని అంతా అంగీకరిస్తారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మద్యం విషయంలో అనుసరిస్తున్న ధోరణి ఇప్పటి గందరగోళానికి కారణం. అధికా రంలోకి రాగానే కల్లు విధానం ప్రకటించారు. హైదరాబాద్‌లో కల్లు అమ్మ కాలను అనుమతించాలని నిర్ణయించారు. అసలు చుట్టుపక్కల తాడిచెట్లు, ఈతచెట్లు లేనిచోట కల్లు దుకాణాలు తెరిస్తే అక్కడ అమ్మేది కల్తీకల్లే మహా ప్రభో అంటే, మన సర్కార్ కొట్టిపారేసింది. ఇప్పటికే చాలా గ్రామాలలో తాటివనాలు అంతరించిపోయాయి. ఆ వృత్తి మీద జీవిస్తున్న సామాజిక వర్గంలోని తరువాతి తరం చదువుల వైపు చూస్తున్నది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం అన్వేషిస్తున్నది. సరైన ఆధారం లేని ప్రమాదకరమయిన ఆ వృత్తిలో ఉండటానికి ఇప్పటితరం అంగీకరించడం లేదు. అయినా సరే, కల్లు డిపోలూ, దుకాణాల తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కల్తీకల్లు విక్రయాలు చాటుమాటుగా కాకుండా బహిరంగంగానే జరుగుతున్నాయి. ఈ కల్తీకల్లు తాగడం వల్ల ఎప్పుడో అప్పుడు మనుషులు తీవ్ర అనారోగ్యం పాలై, చివరికి చనిపోవడం ఖాయం. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇది విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది. ఒత్తిడితోనే సర్కారు వెనక్కి తగ్గిందా? ఇప్పుడు దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం కదా, మళ్లీ విమర్శి స్తారెందుకు అని ఘనత వహించిన మన సర్కారు వారు దబాయించవచ్చు. ఇప్పుడు ఈ కల్తీకల్లు మీద ఎందుకు విరుచుకుపడ్డట్టు? జనం చనిపోవడం మొదలు కావడంతో మళ్లీ కొంతకాలం చూసీచూడనట్టు వ్యవహరించాలని ఎందుకు అనుకుంటున్నట్టు? ఈ తదుపరి నిర్ణయం ఎవరి స్థాయిలో జరి గిందో కానీ కల్తీకల్లు తయారీదారుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం తన సంకల్పం నుంచి వెనక్కు తగ్గిందని మాత్రం ప్రైవేటుగా ఏ అధికారిని అడిగినా చెబు తాడు. సరే, కల్తీకల్లును అరికట్టాలన్న నిర్ణయం వెనక మతలబు ముందు తెలుసుకుందాం. చీప్‌లిక్కర్ ప్రత్నామ్నాయం కారాదు తెలంగాణ రాష్ర్టంలో కల్తీకల్లు, సారాయి, గుడుంబా వంటి ప్రాణాంతక మత్తుపానీయాలను అరికట్టడం కోసం చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని అను కుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రక టన చేశారు. చీప్‌లిక్కర్ పేరిట జనాన్ని మరింత వ్యసనపరులను చేస్తారా అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున విరుచుకుపడటంతో ఆ నిర్ణ యం వెనక్కు తీసుకున్నారు. కల్తీ మద్యం బారి నుంచి జనాన్ని కాపాడటానికి మేం చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టాలనుకుంటే అడ్డుతగులుతారా, మీరే చూడండి ఫలితాలు ఎట్లా ఉంటాయో? అని కల్తీకల్లు మీద దాడులు మొదలు పెట్టిం చింది ప్రభుత్వం. ఎప్పటికైనా ఈ మహమ్మారిని పారద్రోలాల్సిందే కాబట్టి జన బాహుళ్యం దీన్ని సమర్ధిస్తున్నది. కానీ ప్రభుత్వం ఈ చర్య తీసుకో వడానికి ముందు కల్తీకల్లుకు బానిసలైన వారిని బయటకు తీసుకువచ్చి, వాళ్ల ప్రాణాలు రక్షించడానికి అవసరమైన కార్యాచరణను ముందే రూపొందించి అమలులోకి తెచ్చి ఉంటేఅందరి ప్రశంసలు అందుకునేది. కానీ ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇంకా ఎన్ని వైపరీత్యాలు చూడాలో! మద్యం అలవాటు మాన్పించడం కోసం అవసరమైనన్ని డీ అడిక్షన్ కేంద్రా లను నెలకొల్పవలసిందని న్యాయస్థానాలు ముందే చెప్పాయి. అటువంటి ఆలోచనలు ఏమీ చెయ్యకుండా, అవసరమయిన మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోకుండా, సరైన వైద్య సదుపాయాలు కల్పించకుండా, కల్తీకల్లు మీద ఒక్కసారిగా విరుచుకుపడితే ఇటువంటి ఫలితాలే ఎదురవుతాయి. కల్తీ మద్యానికి చీప్‌లిక్కర్ ప్రత్యామ్నాయం కాకూడదు. జనాన్ని ఆ దుర్వ్యసనం నుంచి బయటకు తీసుకువచ్చి వారి ఆరోగ్యాలు బాగుచేసే పథకాలు ప్రభుత్వం రూపొందిస్తే అంతా సంతోషిస్తారు. అది సాధ్యమేనా? రాష్ర్టం నడపడానికి నిధుల కోసం సాగే వేటలో మద్యం ఒక ప్రధాన వనరుగా ఉన్నం తకాలం ఏ ప్రభుత్వానికైనా సాధ్యంకాదు. ప్రభుత్వాలు ఈ సాలెగూడు నుం చి బయటపడే వరకు ఇంకా ఎన్నో వైపరీత్యాలను మనం చూడవలసిందే. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com