
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ వద్ద తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వరదలో బైక్‌తో సహా ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా మత్స్యకారులు కాపాడారు. సైదాపూర్-జాగిర్ పల్లి మధ్య చెరువు మత్తడి దూకడంతో లెవెల్‌లో ఉన్న కల్వర్టు వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. ఇద్దరు యువకులు కల్వర్టు దాటే ప్రయత్నం చేయగా జారి వరదనీటిలో బైక్‌తో సహా పడిపోయారు.
అక్కడే చేపలు పడుతున్న మత్స్యకారులు గమనించి వెంటనే వారిని కాపాడారు. తాడు సహాయంతో బయటికి లాగారు. బైక్‌తో సహా ఒడ్డుకు లాగిన మత్స్యకారులు ప్రమాదానికి గురైన యువకులను ఎక్కడివారు అని అడిగితే సమాధానం చెప్పకుండా బైక్‌పై పారిపోయారు. ఎక్కడి వారు ఎవరు ఆ యువకులు అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ సమయస్పూర్తితో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment