సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి బోట్లు చెలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. అయితే.. సకాలంలో సిబ్బంది స్పందించడంతో ప్రాణాపాయం జరగలేదు.
మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు.
ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment