Major fire breaks
-
మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కూలిపోయిన గోడౌన్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి నిల్వ చేసిన గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయ్నతం చేస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోడౌన్ కుప్పకూలింది. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జబల్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసినపడిన మంటలకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మిగిలిన వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జబల్పూర్, దమోనాకా ప్రాంతంలోని న్యూలైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ సిద్ధార్థ్ బహుగుణా తెలిపారు. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఆసుపత్రిలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. #WATCH | Madhya Pradesh: Fire breaks out at Jabalpur Hospital. Further details awaited pic.twitter.com/RdjjqARKIY — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 1, 2022 ఇదీ చదవండి: చిన్నారిని బలితీసుకున్న చైన్ స్నాచర్.. నీటి సంపులో పడేయడంతో.. -
శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లాల్‌చౌక్ సమీపంలోని కోర్టు రోడ్డులో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధం కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీస్‌కు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు ముంబయిలోనూ అగ్నిప్రమాదం జరిగింది. మన్ఖర్ద్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.