YSR Jalakala
-
AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన ఆస్తులను సృష్టించడానికి 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్) అమలు చేస్తోంది. ఈ ఆస్తులలో 10,917 గ్రామ సచివాలయ భనాలు, 10,243 వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే నిర్మాణాలు, 8,320 భారత్ నిర్మాణ సేవా కేంద్రాలు, ఎక్కువ మోతాదులో పాల శీతలీకరణ చేసే 3,734 పాల శీతలీకరణ యూనిట్లు, నీటి సంరక్షణా కట్టడాలు ఉన్నాయి. డిసెంబర్ 2022 నాటికి ఈ రంగంలో సుమారుగా 18,39 కోట్ల పని దినాలు కల్పించాయి. అంతేగాక 98 శాతం చెల్లింపులు 15 రోజులలోపు చేశారు. ఉచితంగా బోరు బావులు తవ్వి పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ, తద్వారా సాగు యోగ్యమైన భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని పెంచేవిధంగా సీఎం జగన్.. సన్న, చిన్నకారు రైతుల కోసం వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28, 2020న ప్రారంభించారు. ఇప్పటి వరకు 17,047 బోరు బావులు తవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో కుళాయి కనెక్షన్ల ద్వారా సుమారు 65 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించింది. జగనన్న కొత్త హౌసింగ్ కాలనీలతో సహా 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు వీటి కిందకు తీసుకురాబడతాయి. అంతేగాక 250 అంతకంటే ఎక్కువ జనాభా ఉండి రహదారుల అనుసంధానం లేని అన్ని నివాసాలకు అనుసంధానించడానికి 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు'ను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 1,737 కి.మీ. రహదారుల పొడవుతో సుమారు 1,198 ఆవాసాలు ఈ ప్రాజెక్టు క్రింద అనుసంధానం చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,692 కి.మీ. రహదారి పొడవుతో అదనంగా 2,461 ఆవాసాలను కలుపుటకు ఈ ప్రాజెక్టు క్రింద ప్రణాళిక చేయబడింది. ప్రయోజనకరమైన ఈ రహదారుల అనుసంధానం వలన మార్కెట్ మెరుగుపడి రోజువారీ వేతనాల పెరుగుదలకు దారితీసింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 15,873 కోట్ల రూపాయల కేటాయించింది. చదవండి: AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా.. -
జలయజ్ఞ ఫలం.. ఉప్పొంగుతున్న పులిచింతల
అచ్చంపేట: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మహానేత వరప్రసాదిని పులిచింతల ప్రాజెక్టు నిర్మితమైన దశాబ్దం తర్వాత తొలిసారిగా పూర్తిసామర్థ్యానికి నీటి నిల్వ చేరింది. 45.77 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.62 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు. 2004 అక్టోబరులో భూమిపూజ ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఎన్నో యేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబరు 15న గుంటూరు సరిహద్దులోని అచ్చంపేట మండలం, మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజచేశారు. 45.77 టీఎంసీల నీటి నిల్వతోపాటు 23 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. నిర్మాణ కాలంలో నక్సల్స్ ప్రభావం, భారీవర్షాలు, పర్యావరణ అనుమతులు వంటి ఎన్ని అవాంతరాలు వచి్చనా ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ తదిశ్వాస వరకు శ్రమించారు. ఆయన ఉండగానే 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నత్తనడకన సాగిన పనులు ఎట్టకేలకు 2012లో పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు వర్షాలు సక్రమంగా లేక రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టులో 20 నుంచి 25 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం సాధ్యం కాలేదు. గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు అచ్చంపేట, బెల్లంకొండ మండల పరిసరాలలో ఒకప్పుడు 400 నుంచి 500 అడుగులకుపైగా బోరు వేసినా చుక్కనీరు పడేది కాదు. కానీ ఇప్పుడు అవే భూముల్లో 100 నుంచి 200 అడుగుల లోపే నీళ్లు పడుతున్నాయి. ఇది పులిచింతల ప్రాజక్టు పుణ్యమే. 2019 నుంచి వరుణ కటాక్షం 2019 మే నెలలో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతోనే ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులో తొలి సారిగా 40 టీఎంసీలకు మించి నీటిని నిల్వ పెరిగింది. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటినిల్వకు చేరింది. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలోని 23 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఫలితంగా రైతులు రెండు పంటలూ పండిస్తున్నారు. ఇదీ చదవండి: నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -
మెట్ట భూములకు పాతాళగంగ
మెట్ట ప్రాంతాల్లో పారుదల నీటి వసతిలేని సన్న, చిన్న కారు రైతుల పొలాలకు పాతాళ గంగను అందిస్తోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో గడిచిన మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్న అర్హత ఉన్న రైతుల పొలాల్లో ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేస్తోంది. నిపుణుల ద్వారా హైడ్రో, జియాలజికల్, జియోఫిజికల్ అన్వేషణతో జలవనరులను గుర్తించి బోరుబావుల తవ్వకానికి అనుమతులు మంజూరు ఇస్తోంది. తద్వారా మెట్ట భూముల్లో రైతులు సిరులు పండించుకోగలుగుతున్నారు. నెల్లూరు (పొగతోట): మెట్ట ప్రాంతాల్లో జలసిరులు అందించి రైతులు సిరులు పండించేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళను ప్రారంభించింది. ఉదయగిరి, ఆత్మకూరు, రాపూరు, మర్రిపాడు, అనంతసాగరం వంటి మెట్ట ప్రాంతాల్లోని బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ జలకళ ఉపయోగపడుతోంది. ఉదయగిరి, ఆత్మకూరు, మర్రిపాడు తదితర ప్రాంతాల్లో మెట్ట భూములు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాధారంపైనే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ జలకళ పథకాన్ని రైతుల దరిచేర్చేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పథకంపై రైతులకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంది. 2.5 ఎకరాల భూమి కలిగిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతుకు ఒకే ప్రాంతంలో 2.5 ఎకరాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి గతంలో బోరు లేకుండా ఉంటే ఈ పథకానికి అర్హులవుతారు. 2.5 ఎకరాల విస్తీర్ణం లేని రైతులు పక్క రైతుతో కలిపి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. చిన్న, సన్న కారు రైతులకు (కుటుంబానికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన) బోరుతో పాటు విద్యుత్ కనెక్షన్ మోటారు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. 5 ఎకరాల కంటే అధికంగా భూమి కలిగిన కుటుంబాలకు బోరు మాత్రమే తవ్విస్తోంది. అర్హులైన రైతులు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. పంచాయతీ పరిధిలోని క్షేత్ర సహాయకులు, వలంటీర్లు దరఖాస్తు నమోదుకు రైతులకు సహాయపడుతున్నారు. నియోజకవర్గానికి ఒక డ్రిల్లింగ్ యంత్రం జలకళ పథకం ద్వారా బోర్లు వేసేందుకు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్ యంత్రాలను జిల్లాకు కేటాయించింది. ప్రస్తుతం ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో బోర్లు వేయడం ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గంలో రెండు రోజుల్లో వైఎస్సార్ జలకళకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు వేగవంతం చేసి బోర్ల తవ్వకానికి అధికారులు అనుమతులు ఇస్తున్నారు. భూగర్భ జలమట్టం అధిక స్థాయిలో ఉన్న రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలుకాదు. హైడ్రో, జియాలజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించిన అనంతరమే బోరు బావుల తవ్వకానికి అనుమతి మంజూరు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 3 వేలకు పైగాదరఖాస్తులు అధికారులకు అందాయి. వాటిలో సర్వే పూర్తి చేసి సుమారు 2 వేల బోర్లకు అనుమతి మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ 11.64 కోట్ల ఖర్చుతో 1,343 బోర్లు పూర్తి చేశారు. కొత్తగా దరఖాస్తులకు ఆహ్వానం వైఎస్సార్ జలకళ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయిస్తుంది. దరఖాస్తుతో పాటు రైతు పాస్‌ఫొటో, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలతో సచివాలయం లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం మరొక పర్యాయం కల్పించింది. పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రైతుల ఫోన్ నంబర్లు దరఖాస్తులో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి బోరు డ్రిల్లింగ్ చేసేంత వరకు ప్రతి సమాచారాన్ని రైతులకు అందించనుంది. రైతులు దరఖాస్తులు చేసుకోవాలి పేదల రైతుల పొలాలను సాగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళను అమలు చేస్తోంది. బోరు కావాల్సిన అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. రైతులు ఇబ్బందులు పడకుండా సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకునే వేసులబాటును ప్రభుత్వం కల్పించింది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వెంకట్రావు, డ్వామా పీడీ -
జలకళ.. కనెక్షన్ భళా!
కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంతో మెట్ట భూముల్లో ఉచితంగా బోర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ఉచితంగా విద్యుత్ కనెక్షన్, మోటార్ కూడా ఇస్తున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు జలకళ పథకం వరంగా మారింది. ఒకప్పుడు వర్షాధారంపై కనాకష్టంగా సంవత్సరానికి ఒక పంట పండించేవారు. నేడు సమృద్ధిగా నీరు ఉండడంతో మూడు పంటలు పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. 766 బోర్లలో సమృద్ధిగా నీరు జలకళ పథకం కింద రెండున్నర ఎకరాల్లోపు భూమి ఉన్న సన్నకారు రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి డ్వామా (జిల్లా నీటి యాజమాన్యపు సంస్థ) అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. సీనియారిటీ ప్రకారం జిల్లాలో 1100కు పైగా బోర్లు చేశారు. వాటిలో 766 బోర్లలో నీరు పడ్డాయి. దీంతో రెవెన్యూ డివిజన్ల వారీగా జాబితాను విద్యుత్ శాఖ కర్నూలు ఆపరేషన్స్ అధికారులకు అందజేశారు. దీని కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆయా బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంతోపాటు సరఫరా ఇవ్వాలని డ్వామా అధికారులు కోరారు. సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళిక వైఎస్సార్ జలకళ పథకం కింద వేసిన 766 బోర్లకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్నకారు రైతులకు చేదోడుగా నిలవడంతోపాటు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. జలకళ పథకం కింద వివిధ పనుల కోసం రూ.26,60,27,751 నిధులు కావాలని అంచనాలు తయారు చేసి పంపించారు. కర్నూలు టౌన్, కర్నూలు రూరల్, నంద్యాల, ఆదోని, డోన్ డివిజన్ల వారీగా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, లెన్త్ ఆఫ్ లైన్, ఏబీ స్విచ్‌లు, ఇతర సామగ్రి కావాలని అడిగారు. మొత్తం 620కి పైగా ట్రాన్స్ఫార్మర్లకు రూ.3.80కోట్లు, 8,837 విద్యుత్ స్తంభాలకు రూ.1.59కోట్లు, 767 కిలో మీటర్ల విద్యుత్ వైరుకు రూ.2.26కోట్లు, 72.540 కిలో మీటర్ల విద్యుత్ వైరుకు రూ.39.70లక్షలు, ఇతర సామగ్రి, సివిల్ పనులు, లేబర్ చార్జీల కోసం రూ.9.25కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆమోదం లభించడంతో డ్వామా అధికారులు నిధులు విడుదల చేశారు. నాణ్యతతో పనులు ఉమ్మడి జిల్లాల్లో జలకళ కింద వేసి బోర్లకు కనెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ముఖ్యంగా మొదటి వేసిన బోర్లకు సీనియారిటీ ఆధారంగా విద్యుత్ సరఫరా అందిస్తూ వస్తున్నారు. మొదటి విడతలో రూ.2లక్షల లోపు నిధుల అంచనాలో ఉండే 71 బోర్లకు కనెక్షన్లు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ నేతృత్వంలో పనుల నాణ్యతతో చేశారు. విడతల వారీగా పనులు వైఎస్సార్ జలకళ పథకం కింద 766 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని డ్వామా అధికారులు విన్నవించారు. రూ.26.60 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపగా ఆమోదం లభించింది. డ్వామా అధికారులు నిధులు చెల్లిస్తున్న మేరకు విడతల వారీగా పనులు పూర్తి చేసి, కనెక్షన్లు మంజూరు చేస్తున్నాం. – కె. శివప్రసాద్ రెడ్డి, ఎస్ఈ, కర్నూలు ఆపరేషన్స్, విద్యుత్ శాఖ నాడు వర్షాధారం.. నేడు సమృద్ధిగా జలం నడిపి వెంకయ్య స్వామి. ఓర్వకల్లు మండలం ఎన్. కొంతలపాడు గ్రామ వాసి. తనకున్న మూడెకరాల పొలంలో వర్షాధారంపై వివిధ పంటలు సాగు చేసేవాడు. ప్రకృతి సహకరిస్తేనే దిగుబడులు వచ్చేవి. లేదంటే అప్పుల కుప్ప మిగిలేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు దశ తిరిగింది. వైఎస్సార్ జలకళ పథకంతో పొలంలో ఉచితంగా 600 అడుగుల లోతు బోరు వేశారు. రెండు ఇంచుల నీరు పడడంతో విద్యుత్ అధికారులు రూ.2,61,229 వెచ్చించి ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు, విద్యుత్ వైర్లు అమర్చి కనెక్షన్ ఇచ్చారు. సర్వీసు నంబర్ 8322317000412ను విడుదల చేశారు. సమృద్ధిగా నీరు ఉండడంతో ఈయన కూరగాయల పంటలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. -
ఎండిన భూముల్లో జలకళ
బుట్టాయగూడెం: సన్న, చిన్నకారు రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బోర్ల పథకం సత్ఫలితాలిస్తోంది. గతంలో పూర్తిగా వర్షాధారం, చెరువు నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఉచితంగా బోర్లు వేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వసతిలేని భూములు సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో వైఎస్సార్ జలకళ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పొలాల్లో బోర్లు వేసి పంటలకు సాగు నీరు అందేలా కృషి చేస్తున్నారు. జిల్లాలో వైఎస్సార్ జలకళ పథకంలో సుమారు 3,263 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు దరఖాస్తులు పరిశీలించి 3,075 బోర్లు మంజూరు చేశారు. వీటిలో ఇంతవరకూ రిగ్‌ల ద్వారా 516 బోర్లు విజయవంతంగా వేశారు. జిల్లాలోని 48 మండలాలు, 15 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 14 రిగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ రిగ్‌ల ద్వారా రైతులకు ఉచితంగా బోర్లను వేసి సాగునీటి కొరతలేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సుమారు రూ. 100 కోట్ల వరకూ నిధులు కేటాయించారు. ఇంతవరకూ వర్షాధారం మీదే ఆధారపడిన రైతులు సొంతంగా ఉచితబోరు వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో.. ఈ పథకంలో భాగంగా గిరిజన ప్రాంతంలో వేస్తున్న ఉచిత బోర్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉచితబోర్ల పథకం ద్వారా 1132 బోర్లు మంజూరు కాగా ఇంత వరకూ 210 బోర్లు వేసినట్లు అధికారులు తెలిపారు. ఉచిత బోర్ల పథకంలో సాగునీటి సదుపాయం లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో బోర్ల ఏర్పాటు కోసం ఇంతవరకూ రూ. 2.88 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పారు. మంజూరైన బోర్ల పనులను గిరిజన మండలాల్లో వేగవంతం చేశారు. నిబంధనల ప్రకారమే ఉచిత బోర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన చిన్న, సన్నకారు రైతులను గుర్తించి వారి భూముల్లో ఉచిత బోర్లు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఇంతవరకూ 516 బోర్లు విజయవంతంగా వేసి రైతుల భూములకు సాగునీరు అందించే ఏర్పాటు చేశాం. మంజూరైన మిగిలిన బోర్ల పనులు అన్ని మండలాల్లో వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నాం. –డి.రాంబాబు, డ్వామా పీడీ, ఏలూరు పుష్కలంగా సాగునీరు ఉచిత బోర్ల పథకంలో ఇంతవరకూ వేసిన బోర్లు విజయవంతమయ్యాయి. గిరిజన ప్రాంతంలో సుమారు 210 బోర్లు వేశాం. రైతులు ఆయా భూముల్లో మొక్కజొన్న, వరి, ప్రత్తి, పొగాకు వంటి పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరైన ప్రతీ రైతు భూమిలో బోర్లు వేసి సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. –కె. ప్రపుల్‌కుమార్, డ్వామా ఏపీడీ, జంగారెడ్డిగూడెం క్లస్టర్ సాగునీరు అందించడం ఆనందంగా ఉంది నేను 12 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. 3 ఎకరాల 15 సెంట్ల భూమిలో జీడిమామిడి సాగు చేస్తున్నాను. సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాను. ఉచిత బోర్ల పథకంలో బోరు వేయడంతో కష్టాలు తీరాయి. ప్రస్తుతం సాగునీటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేస్తున్నాను. –మడకం దుర్గారావు, గిరిజన రైతు, వంకవారిగూడెం -
వైఎస్ఆర్ జలకళపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ సంకల్పం’ చేయాలి: సీఎం జగన్
అమరావతి: ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ (జగనన్న స్వచ్ఛ సంకల్పం)తో పాటు, వైఎస్సార్ జలకళ, గ్రామీణ తాగునీటి సరఫరా (జల్‌జీవన్ మిషన్-జేజేఎం), వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు), గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ చాలా ముఖ్యం. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్).. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న ప్రారంభం అవుతుంది’ అని సీఎం జగన్ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదని స్పష్టం చేశారు. సీవేజ్ పంపింగ్ ఎలా ఉంది? ఆ నీటిని ఎలా డిస్పోస్ చేయడం ఎలా అనేది చూడాలని అధికారులకు సూచించారు. మురుగునీటిని ట్రీట్మెంట్ ప్లాంట్‌లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్ మొదలు, యూనిఫామ్, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కోట్స్ అన్నీ అదనంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అనే నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుచేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ-వాహనాల నిర్వహణ భారం కాకుండా చూసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలపైనే ఎక్కువ వ్యయం చేయాలని తెలిపారు. ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’లో గ్రామాలు, పట్టణాల్లో పూర్తి పారిశుద్ధ్యం కోసం మున్సిపల్ విభాగం కూడా పంచాయతీరాజ్‌తో కలిసి పని చేయాలని సూచించారు. మనసా వాచా కర్మణా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలని చెప్పారు. మే 1వ తేదీ నుంచి వంద రోజుల పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ చేపడుతున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జలకళ: ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలని నిర్ణయం. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంప్సెట్లు ఇవ్వాలని, దీంతో 3 లక్షల రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా. 5 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని లెక్క. బోర్ వేయాలని ఏ రైతు దరఖాస్తు చేసినా, ఎప్పుడు ఆ బోర్ వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. దీనికి ఎస్ఓపీ ఖరారు చేయండి. ఇచ్చిన తేదీన కచ్చితంగా బోరు వేయాలి. ఆ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదు. నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, పంప్‌సెట్ బిగించాలి. సొంతంగా బోర్లు వేసుకున్న రైతులు ఎవరైనా పంప్సెట్లు కోరితే వారికి కూడా ఇవ్వండి. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంధన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలి. గ్రామీణ తాగునీటి సరఫరా (జల్‌జీవన్ మిషన్- జేజేఎం): జగనన్న కాలనీల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయాలి. నీటి వనరు, సరఫరా రెండూ ముఖ్యమే. జగనన్న కాలనీల్లో జల్‌జీవన్ మిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో నీటి వినియోగంపై ముందే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతి గ్రామంలో ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఆ మేరకు ఏటా ఎప్పుడెప్పుడు, ఏయే ట్యాంకుల్ క్లీన్ చేయాలన్న దానిపై ఒక ప్రొటోకాల్ రూపొందించుకోండి. ఏటా వేసనికి ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేయాలి. ఏలూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు): వీధి దీపాలు ఎల్ఈడీ వాడకంతో యేటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 4 లక్షల దీపాలు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు: ఏపీ రూరల్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్పీ)- ఈఏపీ 30 ఏళ్లుగా 30 వేల కి.మీ. బీటీ రోడ్లు మాత్రమే ఉండగా, మనం అధికారంలోకి వచ్చాక 10 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, మున్సిపల్ శాఖ స్పెషల్ శ్రీలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
బీడు భూములకు జలకళ
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): వైఎస్సార్ జలకళ పథకం అమలుతో రాష్ట్రంలోని బీడు, మెట్ట భూముల్లో జల సిరులు వెల్లివిరుస్తున్నాయి. 2020 సెప్టెంబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా.. 6 నెలల వ్యవధిలోనే కొత్తగా 20 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కలిగింది. ఇప్పటివరకు 4,223 వ్యవసాయ బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. నెల రోజుల క్రితం వరకు గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో ఏదో ఒక పంట ఉండటంతో పనులు కాస్త మందకొడిగా సాగినా.. ఇప్పుడు నిత్యం 50 నుంచి 70 వరకు బోర్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి తవ్వకాల్లో మరింత వేగం పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు భారం లేకుండా.. వైఎస్సార్ జలకళ పథకం అమల్లోకి రాకముందు బోర్లు వేయించుకుని, విద్యుత్ కనెక్షన్ తీసుకొని, మోటారు బిగించుకోవడం అనేది చిన్న, సన్నకారు రైతులకు తలకు మించిన భారంగా ఉండేది. బోరు వేసినా నీళ్లు పడకపోతే.. ఇంకో బోరు వేయడం.. అదీ ఫలించకపోతే మరో బోరు వేయడం వల్ల వేలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వైఎస్సార్ జలకళ పథకం అమల్లోకి వచ్చాక అలాంటి ఇబ్బందులకు, నష్టాలకు చెక్ పడింది. బోరు తవ్వకంతో పాటు పంపుసెట్ ఏర్పాటు వంటివి కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. తవ్వకం పూర్తయిన చోట విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం, మోటార్లు బిగించడంపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 82 నియోజకవర్గాల్లో వేగంగా.. ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వసతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పథకానికి రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. 82 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదికి మించి బోర్ల తవ్వకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలో 253 బోర్ల తవ్వకాలు పూర్తవగా.. కర్నూలు జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో 200 చొప్పున బోర్ల తవ్వకాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1,191 బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. నాలుగేళ్లలో రెండు లక్షల బోర్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రెండు లక్షల వ్యవసాయ బోర్ల తవ్వకం లక్ష్యంగా నిర్ణయించారు. వీఆర్వో స్థాయిలోనే 93,812 దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి.. వాటిని ఆమోదించారు. వాటిలో జియాలజిస్ట్ సర్వే పూర్తయిన 7,892 బోర్ల తవ్వకానికి ఇప్పటికే అన్నిరకాల అనుమతులు మంజూరయ్యాయి. వాల్టా చట్టానికి మార్పులు వాల్టా చట్టం నిబంధనల కారణంగా ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు తవ్వకానికి ఆటంకాలు ఎదురు కావడంతో నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా వాల్టా చట్టాన్ని సవరించేందుకు చర్యలు చేపట్టాం. ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో బోర్ల తవ్వకానికి చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. బోరు తవ్వకానికి ముందే లబ్ధిదారుని భూమిని జియాలజిస్ట్ ద్వారా సర్వే చేయించిన అనంతరమే తవ్వకం ప్రారంభిస్తుండటంతో 81 శాతం బోరు తవ్వకాలు సక్సెస్ అవుతున్నట్టు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు అందుతున్నాయి. – గిరిజా శంకర్, కమిషనర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వైఎస్సార్ జలకళ ఆనందం నింపింది మాకు 4.50 ఎకరాల మెట్ట భూమి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుండక బోరు వేయించలేకపోయాను. మా కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారు. ఎలాంటి రికమండేషన్లు లేకుండానే గత నెలలో బోరు వేశారు. నీరు సమృద్ధిగా పడింది. వైఎస్సార్ జలకళ మా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. – కె.లక్ష్మయ్య, ఇందిరేశ్వరం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా -
'వాల్టా' నిబంధనల మార్పు!
సాక్షి, అమరావతి: రైతుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్టు చట్టం (వాల్టా) నిబంధనల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలమట్టం ఎలా ఉంది, వాల్టా చట్టంలోని ఏయే నిబంధనలు రైతులకు సమస్యాత్మకంగా మారాయి, వీటిని రైతులకు ప్రయోజనం కలిగించేలా ఎలా మార్చాలి, ఇందుకు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలపై కమిటీ ప్రతినిధులైన నిపుణులు లోతుగా అధ్యయనం చేశారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని వ్యవసాయ బోర్లు ఉన్నాయి, ఏయే ప్రాంతాల్లో ఈ బోర్లలో ఎంత లోతులో నీరు ఉంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చిందనే సమాచారాన్ని కూడా తెప్పించుకుని శాస్త్రీయంగా విశ్లేషించారు. ఇంకా కొంత అదనపు సమాచారం పంపాలని రాష్ట్ర భూగర్భ జల శాఖను కోరారు. ఈ శాఖ అధికారులు ఈ డేటా సమీకరించి పంపించే పనిలో ఉన్నారు. 27, 28 తేదీల్లో సెమినార్ ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీలో పంచాయతీరాజ్ కమిషనర్ చైర్మన్‌గా, భూగర్భ జల శాఖ సంచాలకులు కన్వీనర్‌గా, ఆయా రంగాల/సంస్థల ప్రతినిధులైన నిపుణులు సభ్యులుగా ఉన్నారు. జాతీయ భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) వాటర్ షెడ్ విభాగం డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్), నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ప్రతినిధులు, రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ తదితరులు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు, డ్వామా పీడీలు, జల వనరుల శాఖ ఎస్ఈలు, ఇతర జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా సెమినార్ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ ప్రతినిధులంతా ఈ సెమినార్‌కు హాజరై చర్చలు జరుపుతారు. అనంతరం చట్టంలోని నిబంధనల మార్పునకు సంబంధించి ఈ కమిటీ త్వరలో మధ్యంతర నివేదిక సమర్పించే దిశగా కసరత్తు చేస్తోంది. అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుంది. అసలు చిక్కు ఇదీ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో–227 జారీ చేసింది. భూగర్భం నుంచి నీటిని ఎక్కువగా తోడేసిన (ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్) ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయరాదనేది ఇందులో ఒక నిబంధన. రాష్ట్రంలో ప్రస్తుతం 1,094 గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో ‘వైఎస్సార్ జలకళ’ పథకం కింద కూడా బోర్లు వేయడానికి లేదు. అలాగే హార్డ్ రాక్ ప్రాంతంలో 120 మీటర్ల లోతుకు మించి బోరు వేయరాదనేది మరో నిబంధన. ఒక బోరు ఇంత దూరంలో ఉంటే ఆ పరిధిలో మరో బోరు వేయరాదనేది ఇంకో నిబంధన జీవోలో ఉన్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఇక్కడ 120 మీటర్ల లోతున మాత్రమే బోరు వేయాలన్న నిబంధన ఉంది. ఇంత లోతు మాత్రమే బోరు వేస్తే నీరు రాదు. అందువల్ల బోరు వేసినా ప్రయోజనం శూన్యం. అలాగే 200–300 మీటర్ల పరిధిలో బోరు ఉంటే మరో బోరు వేయకూడదనే నిబంధన వల్ల పక్క రైతు పొలంలో బోరు ఉంటే మరో రైతు వేసుకోవడానికి వీలుకాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్లు వేసి మోటర్లు అమర్చాలనే సమున్నత ఆశయంతో ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళకూ ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయి. దీనివల్ల తమకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం లేకుండా పోయిందని, ఈ నిబంధనలను సవరించాలని రైతుల, రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి పెద్దఎత్తున వినతులు అందాయి. దీంతో రైతుల ప్రయోజనార్థం ఈ నిబంధనలు మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు సమర్పించే బాధ్యతను ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. -
వైఎస్సార్ జలకళ ద్వారా మార్చి నాటికి 22,400 ఉచిత బోర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకం ద్వారా మార్చి నెలాఖరు కల్లా రైతుల పొలాల్లో 22,400 ఉచిత బోర్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వాటర్ షెడ్ డైరెక్టర్ పీవీఆర్ఎం రెడ్డి బుధవారం 13 జిల్లాల డ్వామా పీడీలతో సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో 3,200, ఫిబ్రవరిలో 9,600, మార్చిలో 9,600 చొప్పున ఉచిత బోర్లు తవ్వేందుకు జిల్లాల వారీగా ప్రణాళికలు ఖరారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల దరఖాస్తులు నిబంధనల మేరకు తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఆయా రైతులు కనీసం రెండున్నర ఎకరాలుండేలా గ్రూపులుగా ఏర్పడి తిరిగి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు సూచించారు. -
జలకళ పెంపు.. నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: బీడువారిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఉచిత బోర్లు వేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా.. పథకం ద్వారా అధిక ప్రయోజనం కలిగేలా నిబంధనలను మార్చేందుకు కసరత్తు ప్రారంభించింది. నాబార్డు మార్గదర్శకాలను అనుసరించి తొలుత వైఎస్సార్ జలకళ పథకానికి నిబంధనలు రూపొందించారు. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల వల్ల ఈ నిబంధనలు ప్రతికూలంగా మారాయి. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భూగర్భ జల శాఖ గణాంకాలను విశ్లేషించిన అనంతరం నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు మార్పులు చేసేందుకు నిర్ణయించింది. సమస్యలు ఏమిటంటే.. వాస్తవానికి 200 మీటర్ల పరిధిలో వ్యవసాయ బోరు ఉంటే మరో బోరు మంజూరు చేయకూడదు. రాతి నేలల్లో 120 మీటర్ల లోతుకు మించి బోర్లు వేయరాదనే నిబంధన ఉంది. ఇసుక నేలల్లో బోరు లోతుపై పరిమితి లేదు. కానీ.. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,200 అడుగల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. దీంతో ఇక్కడ 120 మీటర్ల నిబంధన వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అలాగే ఒక రైతు భూమిలో బోరు ఉంటే పక్క రైతు భూమి వంద మీటర్ల పరిధిలోనే బోరు వేయాల్సి ఉంటుంది. అందువల్ల కనీసం 200 మీటర్ల దూరం దాటిన తర్వాతే మరో బోరు వేయాలనే నిబంధన రైతులకు అశనిపాతంగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పథకం నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. తగిన సిఫార్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర భూగర్భ జల శాఖ , గ్రామీణ నీటి సరఫరా, జల వనరులు తదితర విభాగాల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి రాష్ట్ర భూగర్భ జలశాఖ సంచాలకులు సభ్య కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సులతోపాటు రాష్ట్ర భూగర్భ జలశాఖ ఇచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని ప్రభుత్వం సవరించనుంది. నిబంధనల్ని సవరిద్దాం ‘ప్రతి రైతుకూ ఉపయోగపడేలా వైఎస్సార్ జలకళ నిబంధనలను సవరిద్దాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిఫార్సులు సమర్పించండి. రాయలసీమలో ఒక్కో రైతు 1,200–1,400 అడుగుల లోతు బోర్లు వేసినా నీరు రాని పరిస్థితిని కళ్లారా చూశాం. వీటిని పరిగణనలోకి తీసుకోండి’ అని ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు.