
‘వైఎస్ఆర్ వల్లే ప్రాజెక్టులకు జలకళ’
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లి మిడ్ మానేరు గండిని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం సందర్శించి, బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మిడ్ మానేరు గండికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులు కోరినట్లు పరిహారం చెల్లించకుంటే మిడ్ మానేరు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. మన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించి, 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.