
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అన్ని జిల్లా, అసెంబ్లీ, మండల కేంద్రాల్లోని వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించి నివాళులర్పించాలని శనివారం ఒక ప్రకటనలో కార్యకర్తలకు సూచించారు.
రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆస్పత్రులల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహించే వైఎస్సార్ జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొనాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment